Advertisementt

పవన్ పవర్: నిమిషానికి కోటి

Wed 07th Apr 2021 05:42 PM
pawan kalyan,vakeel saab movie,dil raju,shocking remuneration,vakeel saab pawan kalyan,pawan vakeel saab,vakeel saab review  పవన్ పవర్: నిమిషానికి కోటి
Pawan Power: One crore per minute పవన్ పవర్: నిమిషానికి కోటి
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ దగ్గరపడే కొలది ఫాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతుంది. వకీల్ సాబ్ ట్రైలర్ తోనే అంచనాలను తారుమారు చేసిన ఫాన్స్.. సినిమా కలెక్షన్స్ భారీగా రావాలంటూ కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలను - వకీల్ సాబ్ షూటింగ్ ని మ్యానేజ్ చేస్తూ.. ఈ సినిమాని కంప్లీట్ చేసారు. దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ కి ఏ చిన్నపాటి ఇబ్బంది కలగకుండా చక్కగా మేనేజ్ చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో గట్టిగా కనిపించేది జస్ట్ 50 నిమిషాలే. ఆ 50 నిమిషాలకే 50 కోట్ల పారితోషకం పవన్ అందుకుంటున్నారు.

అంటే నిమిషానికి కోటి లెక్కన పవర్ స్టార్ పారితోషకం ఉంది. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ విలువ నిమిషానికి కోటి రూపాయలు. మరి దిల్ రాజు పవన్ మీద భారీ పెట్టుబడి పెట్టాడు. వకీల్ సాబ్ సినిమా 'లో' బడ్జెట్ లో తెరకెక్కాల్సింది కాస్తా పవన్ పారితోషకం తో కలిపి భారీ బడ్జెట్ మూవీగా వకీల్ సాబ్ ని చూపిస్తున్నాడు. దిల్ రాజు ఎంత బడ్జెట్ చూపించినా పవన్ క్రేజ్ తో వకీల్ సాబ్ కలెక్షన్స్ విషయంలో కుమ్మెయ్యడం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ కి దిల్ రాజు నిమిషానికి కోటి రూపాయల చొప్పున పారితోషకం లెక్కగట్టి మరీ ఇచ్చాడు. ఏదైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఈ కోట్లు దిల్ రాజుకి ఓ లెక్కలా కనిపించలేదు.

Pawan Power: One crore per minute:

Dil Raju Shocking Remuneration To Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ