Advertisementt

కొత్త ఆలోచనల కోసం బ్రేక్ అంటున్న నాగ్

Fri 30th Sep 2022 07:58 PM
akkineni nagarjuna,the ghost,ott  కొత్త ఆలోచనల కోసం బ్రేక్ అంటున్న నాగ్
Nagarjuna to take break post The Ghost కొత్త ఆలోచనల కోసం బ్రేక్ అంటున్న నాగ్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది బంగార్రాజు తో హిట్ అందుకున్న అక్కినేని నాగార్జున.. ఆ సక్సెస్ ని కొడుకు నాగ చైతన్య తో పంచుకోవాల్సి వచ్చింది. అయన రీసెంట్ మూవీ ద ఘోస్ట్ మీద నాగ్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతం ఘోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు నాగార్జున. అక్టోబర్ 5 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఘోస్ట్ సెకండ్ ట్రైలర్ లాంచ్ చేసింది టీం. అయితే నాగార్జున ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ ఘోస్ట్ సినిమా తర్వాత మళ్ళీ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు అని, అయితే సినిమాల నుండి ఓ ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పి నాగ్ షాకిచ్చారు. ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ మారింది అని, కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది అని చెప్పిన ఓ నిర్ణయం తీసుకున్నారట.

అసలు ఆడియన్స్ కి ఏం చేస్తే నచ్చుతుంది. ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా.. ఆ విషయాలు తెలుసుకోవాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఈసారి కొత్త ఆలోచనలతో కొత్త కథతో రావాలనుకుంటున్నా.. ఘోస్ట్ తర్వాత ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. ఈసారి ఓటిటి ప్రణాళికలతో రావాలనుకుంటున్నా.. స్క్రిప్ట్ ఓకె అయితే అది థియేటర్స్ కి సరిపోతుందా? లేదంటే ఓటిటికి పనికొస్తుందా అనేది ఆలోచించాలి. దానికి సమయం పడుతుంది అంటూ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Nagarjuna to take break post The Ghost:

Akkineni Nagarjuna decided take rest six months movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ