సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ ఫిలింగా తెరకెక్కుతున్న SSMB28 చిత్రం షూటింగ్ విషయంలో మహేష్ ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. SSMB28 షూటింగ్, అలాగే త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉన్నాడంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం, నిర్మాత నాగ వంశీ అలాంటిదేం లేదు.. రూమర్స్ నమ్మకండి.. అన్నీ సవ్యంగా ఉన్నాయంటూ క్లారిటీ ఇస్తూ రావడంతో మధ్యలో మహేష్ ఫాన్స్ లో అయోమయం ఏర్పడుతుంది.
అయితే మహేష్ మాత్రం కూల్ గా వేసవి సెలవలని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ అండ్ లుక్ కృష్ణగారి జయంతి సందర్భంగా అంటే మార్ 15 రోజుల్లో ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈలోపులో SSMB28 టైటిల్ పై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆల్మోస్ట్ అమరావతి టైటిల్ ఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఏ టైటిల్ పై వస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తో త్రివిక్రమ్ మరో టైటిల్ పై కాన్సంట్రేట్ చేస్తున్నట్టుగా టాక్.
అందులో ముఖ్యంగా గుంటూరుపై వచ్చే టైటిల్ పై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మహేష్ ఫస్ట్ లుక్ కూడా గుంటూరు మిర్చి యార్డ్ కి రిలేటెడ్ గా ఉండడంతో టైటిల్ కూడా గుంటూరు మీద వచ్చేలా చూస్తున్నారని తెలుస్తుంది. గుంటూరు మార్చి, గుంటూరు అబ్బాయి అలాంటి టైటిల్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి మే 31 ఫైనల్ గా మహేష్ అమరావతిగానా.. లేదంటే గుంటూరు కుర్రోడిగా దిడుగుతాడో చూడాలి.