Advertisementt

రచ్చ మాములుగా లేదు బాసు

Sun 08th Oct 2023 11:44 AM
bigg boss 7  రచ్చ మాములుగా లేదు బాసు
Bigg Boss 7 today episode promo viral రచ్చ మాములుగా లేదు బాసు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటినుంచి స్టిల్ ఇప్పటివరకు ఏమాత్రం ఆసక్తి లేకుండా నడుస్తుంది. నాగార్జున ఏదో ఉల్టా పుల్టా అని చెబుతున్నా ఈ సీజన్ పై ఏ మాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఓపినింగ్ ఎపిసోడ్ కి మంచి టిఆర్పి వచ్చినా.. ప్రస్తుతం వీక్ డేస్ లో బిగ్ బాస్ ని చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇక ఈ సీజన్ లో చాలా తక్కువమంది అంటే 14 మంది మాత్రమే ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటివరకు నాలుగురు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడగా.. ఈరోజు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. 

ఒకరు ఎలిమినేట్ అయితే మరో ఆరుమంది ఈ రోజు ఆదివారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్ పైకి ఈ ఎపిసోడ్ కోసం చిన్నా హీరో సిద్దార్థ్, టైగర్ నాగేశ్వరావు హీరో రవితేజ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం రాబోతున్నారు. అంతేకాకుండా  ఈరోజు ఎలిమినేషన్ కూడా కొత్తగా ఉండబోతుంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిని హౌస్ నుంచి ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచారు. 

అందులో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అనేది సస్పెన్స్ అన్నారు నాగార్జున. ఇక సిద్దార్థ్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో రచ్చ చేసారు. మరి ఈరోజు హౌస్ లోకి ఏ ఆరుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారో కానీ.. ఈరోజు ఎపిసోడ్ తో బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం రచ్చ రచ్చే అన్నట్టుగా ఉంది. 

Bigg Boss 7 today episode promo viral :

Bigg Boss 7 today special episode

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ