Advertisementt

యాత్ర 2 రివ్యూ

Thu 08th Feb 2024 06:18 PM
yatra 2  యాత్ర 2 రివ్యూ
Yatra 2 Review యాత్ర 2 రివ్యూ
Advertisement
Ads by CJ

యాత్ర 2 రివ్యూ 

బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్

నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు 

సినిమాటోగ్రఫి: మధీ 

ఎడిటర్: శ్రవణ్

మ్యూజిక్: సంతోష్ నారాయణ్

నిర్మాత: మేక శివ

రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ   

రాజకీయాల్లో పాదయాత్ర పేరుతొ కొత్తవరవడికి నాంది పలికి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి సీఎం పీఠాన్ని అధిష్టించి ప్రజలకు సేవ చేసిన వైస్ రాజశేఖర్ రెడ్డి బయో పిక్ గా మహి వి రాఘవన్ దర్శకతంలో యాత్ర మూవీని తెరకెక్కించగా.. అది ఏపీ ప్రజలని ఓ ఊపు ఊపేసింది. YSR మరణంవరకు తెరకెక్కిన ఆ చిత్రం ఆంధ్ర ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా YSR మరణం తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్రెడ్డి ప్రజల్లోకి వెళ్లి, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, తండ్రి మరణం వార్త విని ఆగిన గుండెల కుటుంబాలని ఓదారుస్తూ ఓదార్పు యాత్ర చేసిన ఘట్టాలను, జగన్ కాంగ్రెసోళ్లతో పోరాడి,కొత్త పార్టీ పెట్టి సీఎం అవ్వడానికి పడిన కష్టాన్ని మహి వి రాఘవన్ యాత్ర 2 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో యాత్ర2పై అంచనాలు పెంచారు. యాత్ర 2 సమీక్షలోకి చూస్తే..

యాత్ర 2 కథలోకి వెళితే.. 

ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న YS రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఎంపీ గా ఉన్న YSR కొడుకు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీలోని లోని YSR అభిమాన ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్టానానికి పంపిస్తారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సీఎం కుర్చీని జగన్‌కు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఆలాంటి సమయంలోనే తన తండ్రి మరణంతో గుండె పగిలి మరణించిన వందల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపడతారు. ఆ యాత్ర చేయవద్దని జగన్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తుంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను జగన్ చేపడుతాడు. ఓదార్పు యాత్రను చేపట్టిన జగన్‌కు కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. టువంటి పరిస్థితుల్లో జగన్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఆశ్రమంలోనే అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌ను ఎలా అరెస్ట్ చేశారు? అరెస్ట్ తర్వాత సమస్యలని ఎదురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడనేది యాత్ర 2 కథ.

దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి కథ చెప్పడానికి ఎమోషన్‌నే నమ్ముకున్నాడు, ఫస్ట్ సీన్ నుంచే ఈ మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు మహి, మమ్ముట్టి ఉన్న సీన్స్ అన్నీ మరోసారి హైలైట్ అయ్యాయి..

ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నది కాసేపే అయినా. ఎమోషన్ అద్భుతంగా పండింది, అలాగే జగన్ ఎపిసోడ్స్ మొదలైన తర్వాత కూడా స్పీడ్ ఎక్కడా తగ్గలేదు, డిల్లీ నుంచి ఎదురయ్యే సవాళ్లు.. రాష్ట్రంలోని సమస్యలు, ఎన్నిసమస్యలు మీదకు వస్తున్నా.. ఒక్కడే ముందుకెళ్లాడు అని చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు..

యాత్ర రేంజ్‌లో ఇందులో ఎమోషన్ అయితే పండలేదు.. యాత్ర 1 లో రాజశేఖర్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేసాడు.. దాని వెనక కారణాలేంటి, అనే ఓ విశ్లేషణాత్మకంగా ముందుకు సాగుతుంది కథ.. అందుకే అంతగా కనెక్ట్ అయింది, అయితే యాత్ర 2 లో ఎమోషన్స్ కంటే ఎక్కువగా పాలిటిక్స్ కనిపించాయి, ఒకరిపై ఒకరు యుద్దం.. ఒక్కడిపై అందరూ చేసే కుట్రలు.. అవే ఎక్కువగా ఎమోషన్స్‌ను డామినేట్ చేసినట్లు అనిపించాయి..ఇక డైలాగ్స్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి..  ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయాయి.. 

ఎఫర్ట్స్:

వైఎస్ఆర్‌గా మమ్ముట్టి గురించి చెప్పడానికేం లేదు.. అద్భుతం అంతే.   వైఎస్ జగన్‌గా జీవా బాగున్నాడు.. స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది, హావభావాలు, రోల్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌ను పక్కాగా జీవా దించేశాడనే చెప్పాలి. ఎలాంటి తడబాటు, సందేహాలు లేకుండా జీవా తన లభించిన పాత్రలో దూరిపోయాడు. ఎక్స్‌లెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో అందర్ని ఎమోషనల్‌గా కదలిస్తాడు. ఇక మిగితా పాత్రల్లో కేవీపీ తరహ పాత్ర (శుభలేఖ సుధాకర్), చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, భారతీగా కేతకీ నారాయణ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సోనియా పాత్రలో నటించిన ఆర్టిస్టు కూడా అద్బుతంగా చేసింది. నందిగం సురేష్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ కుమార్ గుర్తుండిపోయే విధంగా నటించాడు. విజయమ్మ పాత్ర, ఇంకా మిగితా ఆర్టిస్టులు ఇలా దర్శకుడు మహి.. ప్రతి కేరెక్టర్ లోను అసలు కేరెక్టర్స్ తారసపడేలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. 

ఈ సినిమాకు మ్యూజిక్, కెమెరా వర్క్ హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. ఫస్టాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే పాట ఇంకా బెటర్‌గా ఉంటే మరింత ఎమోషన్స్ డ్రైవ్ చేసేందుకు అవకాశం ఉంది. మిగితా అంశాలతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

మహి వి రాఘవ్ తను అనుకున్నది స్క్రీన్ మీద చూపించాడు.. ఓవరాల్‌గా యాత్ర 2.. రాజకీయంగా చూడకపోతే అలరించే పొలిటికల్ ఎంటర్‌టైనర్.

రేటింగ్: 3/5

Yatra 2 Review:

Yatra 2 Telugu Review

Tags:   YATRA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ