Advertisementt

అక్కడ బిజెపి.. ఇక్కడ కాంగ్రెస్ ఏంటి కథ బాబు

Fri 08th Mar 2024 12:13 PM
chandrababu  అక్కడ బిజెపి.. ఇక్కడ కాంగ్రెస్ ఏంటి కథ బాబు
Chandrababu అక్కడ బిజెపి.. ఇక్కడ కాంగ్రెస్ ఏంటి కథ బాబు
Advertisement
Ads by CJ

చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తుల కోసం తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకంలో తలమునకలైన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతనాలతో మంతనాలు జరుపుతున్నారు. నిన్న గురువారం చంద్రబాబు బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఢిల్లీలో బీజేపీ నేతలు అమిత్ షాతో ఇప్పటికే మీటింగ్ పెట్టి బీజేపీతో పొత్తు పై ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది.

ఎలాగైనా బీజేపీతో జట్టు కట్టి ఈ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తుకోసం ఆరాటపడుతున్న చంద్రబాబు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బేగం పేట ఎయిర్ పోర్ట్ లో కలవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అది యాదృచ్ఛికమో.. లేదంటే మరేదన్నానో గురు శిష్యులు ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా కలవడం హాట్ టాపిక్ గా మారింది.  అది చూసిన చాలామంది బీజేపీ తో పొత్తు కోరుకుంటూ.. కాంగ్రెస్ వాళ్లతోను ఉండడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు-రేవంత్ రెడ్డి ఇద్దరూ గురు శిష్యులు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఏపీ ఎన్నికల్లో ఏం చేస్తారో.. ఎలాంటి గూడుపుఠానీలు జరుపుతారో అని మాట్లాడుకుంటున్నారు.

అంతేకాకుండా ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ బోర్డర్ లో డబ్బు ట్రాన్స్ఫర్ కోసం.. సీఎం రేవంత్ తో చంద్రబాబు బేగం పేట ఎయిర్ పోర్ట్ లో మంతనాలు అంటూ వైసీపీ నేతలు బహిరంగానే మాట్లాడుతున్నారు.

Chandrababu:

BJP-Chandrababu

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ