సోషల్ మీడియా సైకోల వేధింపులకు బలైపోయిన గీతాంజలిని ఇంకా ట్రోల్స్ చెయ్యడం ఆపడం లేదు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోలింగ్ కారణమంటూ ఆమె భర్త, పిల్లలు చెబుతున్నారు. కానీ టీడీపీ, జనసేన వాళ్లు మాత్రం అది హత్య, ఆత్మహత్య కాదు అంటూ ఆరోపించడమే కాకుండా.. వీడియోలు సైతం తయారుచేసి, దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు.. అంటూ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు.. మీకు ప్రజలు బుద్ది చెప్పే సమయం దగ్గరపడింది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
శవాలను, కళేబరాలను పీక్కుతినడం రాబందుల జీవన విధానం.. అవి దొరక్కపోతే రాబందులు తిండిలేక అంతరించిపోతాయి... ఇప్పుడు రాజకీయ రాబందులూనా ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన నేతలు తయారయ్యారు.. అంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
తాము చేసింది తప్పు.. కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తారు అనే పరిస్థితి రాగానే వాళ్ళ క్యారెక్టర్ .. వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసే పనికోసం తమ మీడియాను, సోషల్ మీడియాను పురమాయిస్తారు
ఆనాడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న చంద్రబాబు మీద ప్రజా వ్యతిరేఖత 2019 ఎన్నికల్లో చూసారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు. నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి హింసించి చంపేసి ఆ తరువాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు.