అలా మొదలయ్యింది చిత్రంలో హీరో నానికి ఫ్రెండ్ గా నటించిన స్నిగ్ద అంటే తెలియని వారుండరు. ఆమె అమ్మాయే అయినా.. అబ్బాయి గెటప్ లో స్పషల్ గా కనిపిస్తుంది. అబ్బాయిలా డ్రెస్ చేసుకుంటుంది, హెయిర్ స్టైల్ అలానే అబ్బాయిలా కట్ చేయించుకుని ఉంటుంది. ఆమె సినిమాల్లో కూడా అలాంటి కేరెక్టర్స్ వేసింది. అయితే ఈమధ్యన సినిమాల్లో ఎక్కువగా కనిపించని స్నిగ్ద ని పెళ్లి గురించి అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
స్నిగ్ద శివ భక్తురాలు. ఆమె ఏడాదిలో నాలుగు నెలలు శివ మాలలోనే కనిపిస్తుంది. అయితే తనకి పెళ్లి చేసుకోవడం అంటే అంతగా ఇష్టం లేదు, నాకు పెళ్లి బందంపై నమ్మకం లేదు, అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా లేదు అంటూ చెబుతుంది. ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి సందర్భం రాలేదు. ప్రెజెంట్ నేను దీక్షలో ఉన్నాను. 120 రోజులు ప్రశాంతగా ఉంటాను. పెళ్లి చేసుకుంటే నేను వేరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోతాను. అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
పెళ్లి చేసుకుంటే పిల్లలు, బాధ్యతలు పెరిగిపోతాయి, లైఫ్ లాంగ్ పిల్లల చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించుకొన్న దానిలో కొంత మనం ఖర్చు పెట్టుకుని మిగతా డబ్బు అనాధాశ్రమానికి ఇస్తే అక్కడ పిల్లలు బాగుపడతారు.. నేను ప్రస్తుతం అదే పని చేస్తున్నాను అంటూ స్నిగ్ద పెళ్లి విషయాన్ని తేల్చేసింది.