ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వెల కట్టి అమ్మేసుకుంటున్నారు ఆయా పెద్దలు. బీజేపీకి తామే దిక్కన్నట్లుగా బయటకు వ్యవహరిస్తూ.. అంతర్గతంగా విలువ కట్టి కోట్లు కూడబెట్టుకుంటూ అమ్మేసుకుంటున్నారనే మాట రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చిన కొంత మంది అనుకున్నది సాధించుకుని ఇప్పుడు వచ్చిన ఆ అరకొర సీట్లను కూడా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఇచ్చేందుకు సిఫారసు చేస్తున్నారట. రెండు రోజులుగా బీజేపీలో జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
సాధారణంగా పొత్తులు పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలంతా పోటీ చేసేలా సీట్లను కేటాయింప చేసుకోవడం ప్రాథమికంగా ఎవరైనా చేసే పని. కానీ ఏపీ బీజేపీలో సీనియర్లకు టిక్కెట్ దక్కకుండా చేసేందుకు వారికి అనుకూలమైన సీట్లు అడగకపోగా ఇస్తామని తెలుగు దేశం చెప్పినా మాకు వద్దని పక్కన పెట్టేస్తున్నారట. ఏపీ బీజేపీ అంటే అధ్యక్షురాలు పురందేశ్వరి ఓక్కరుమాత్రమే కాదు కదా.! చాలా మంది ముఖ్య నేతలు ఉన్నారు. సోము వీర్రాజు. జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, లాంటి వారు ఉంటారు. అయితే ఈ ఆరుగురు సీనియర్ నేతలకు అనువైన సీట్లు కేటాయింప చేసుకోవాల్సిన పరిస్థితుల్లో... పూర్తిగా వారికి చాన్స్ రాకూడదన్న ఆలోచనతో అధ్యక్షురాలు చక్రం తిప్పారనే మాట బీజేపీ లో కలవరం కలిగిస్తుంది. లేనిపోని సర్వే నివేదికలు చూపించి.. చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ సీనియర్లు అందరు పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
బీజేపీ తరపున వారు కాక ఇంకెవరు పోటీ చేస్తారంటే.. అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఎమ్మెల్యే సీట్ల విషయంలో వేలం పాట జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీకి నిధులు సమాకూర్చే నేతలు నేడు కీలకంగా మరరంటున్నారు.
ఏపీ బీజేపీలో సీట్ల గోల్ మాల్ - చేతులు మారిన కోట్లు
దీనిని అవకాశంగా మార్చుకోని నేడు సీట్లుకోసం కోట్లు చేతులు మారుతున్నాయని మాట గట్టిగానే ప్రచారంలోకి వచ్చింది. స్వంత అవసరాలకోసం ఎక్కువ కోట్లు ఇచ్చిన వారికి అనుకూలమైన సీట్లను కేటాయింప చేసుకున్నారు.
ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేసే వారు ఎవరు అంటే.. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ , గోనుగుంట్ల సూర్యనారాయణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నారు. వీరిలో ఎవరూ బీజేపీకి సేవ చేసిన వాళ్లు కాదు. మరి వీరికెందుకు సీట్లు కేటాయిస్తున్నారు ? సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయట. దీనిపై హైకమాండ్ పెద్దలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
గెలవని సీట్లు తీసుకోని ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఇచ్చిన సొమ్మును పంచుకోవడానికేనని హైకమాండ్ కి కొందరు పిర్యాదులు చేస్తున్నట్లు టాక్.