Advertisementt

వైస్సార్సీపిలోకి ముద్రగడ

Fri 15th Mar 2024 04:37 PM
mudragada padmanabham  వైస్సార్సీపిలోకి ముద్రగడ
Mudragada వైస్సార్సీపిలోకి ముద్రగడ
Advertisement
Ads by CJ

తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కావాలనే ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించి అవమానించారు. అప్పటినుంచి ముద్రగడకి మద్దతుగా కాపుల్లో చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే కులరాజకీయాల నేపధ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అ

యితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా కామెట్ చేయడంపై కాపుల్లో కలవరం మొదలైంది. ముద్రగడ కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పద్మనాభం చేరికతో వైసీపీ పార్టీకి బలం పెరగనుంది. సీఎం వైయస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ఇస్తానని మోసం చేశారు. అలాగే కాపునేస్తం అందించి కాపు సామాజికవర్గంలో ఆర్దికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్ధులకు కేటాయించారు. కాపు నేస్తం తో ఎంతోమంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు.

జోగయ్యను, పద్మనాభంలాంటి వారని జనసేనలోకి రాకుండా చంద్రబాబు, మనోహర్ అడ్డుకున్నారని కాపులంతా ఆరోపిస్తున్నారు. అయితే ఇపుడు పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్ల జనసేన వైపు  మళ్లకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది.

Mudragada :

Mudragada Padmanabham

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ