ఎప్పటి నుంచో తెలుగు దేశంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్ 2019లో టీడీపీ ఓడిన తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఎంపీగానే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మరోసారి ఎంపీగా ఎన్నికవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయన రాజకీయాల్లో డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎం రమేష్ ఓ బిజినెస్ మ్యాన్. ఆయన రిత్విజ్ ప్రాజెక్ట్స్ పేరుతో కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. సీఎం రమేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బంధువులు ఈ కంపెనీని చూసుకుంటున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో పలు రకాల ప్రాజెక్టులు చేపట్టారు. ఏపీ కన్నా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ పనులు చేపడుతూ ఉంటారు. అయితే సీఎం రమేష్ కాంగ్రెస్ ఖాతాలోకి డబ్బు మరల్చరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు. వాటిని కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకుంది. అలాగే మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్ కు కూడా పది కోట్ల రూపాయలన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చారు.
అసలు బీజేపీ పార్టీలో ఉన్నవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి విరాళం ఇవ్వడం అనేది హాస్యాస్పదం. కానీ సీఎం రమేష్ ఇచ్చాడు అనగానే.. అందరూ అది చంద్రబాబు చేయించాడు.. చంద్రబాబు కి సీఎం రమేష్ విధేయుడు. చంద్రబాబు రమేష్ చేత కాంగ్రెస్ కి విరాళాలు ఇప్పించాడు, సీఎం రమేశ్ ని బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్ కి రూ.30 కోట్ల నిధులు నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం చేసింది.. షర్మిలని ఏపీ పీసీసీకి నియామకం దగ్గర నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు, ఇప్పుడు కడపలో షర్మిలని పోటీకి దించడం కూడా బాబు వ్యూహమే.
ప్రస్తుతం PK, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేశ్ దే.. అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్ కి తెలుగుదేశం పార్టీ మాతృపార్టీ. ఆ పార్టీకి కూడా ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు..అంటూ వైస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.