Advertisementt

టీడీపీ తుది జాబితాపై నిరసనల వెల్లువ

Fri 29th Mar 2024 07:14 PM
tdp  టీడీపీ తుది జాబితాపై నిరసనల వెల్లువ
TDP టీడీపీ తుది జాబితాపై నిరసనల వెల్లువ
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు విడుదల చేసిన రెండు లిస్ట్ ల అభ్యర్థులతో పాటుగా.. చివరి లిస్ట్ అంటే 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌ స్థానాలకు టీడీపీ తుది జాబితా అభ్యర్థులను ప్రకటించింది. 

అసెంబ్లీ అభ్యర్థులు

చీపురుపల్లి- కళా వెంకట్రావు

భీమిలి- గంటా శ్రీనివాసరావు

పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు

దర్శి- గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు- వీరభద్ర గౌడ్‌

గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్

అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌

పార్లమెంట్ అభ్యర్థులు

విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు

ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి

అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ

కడప- భూపేష్‌రెడ్డి

అయితే ఇప్పుడు టీడీపీ వదిలిన తుది జాబితాపై విజయనగరం జిల్లా టిడిపిలో నిరసనలు మొదలయ్యాయి. తమకు సీటు వస్తుంది అని ఆశించిన నేతలు.. తమకి చంద్రబాబు సీటు కేటాయించకపోవడంపై నిరసనలకు దిగడమే కాదు.. పార్టీ కి సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోలపై చెప్పులతో కొడుతూ, టీడీపీ అధినేత, లోకేష్ ఫోటోలను మంటల్లో వేసి కాల్చివేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. 

పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష పదవికి, చీపురపల్లి ఇన్ ఛార్జ్ పదవికి కిమిడి నాగార్జున రాజీనామా లేఖ హాట్ టాపిక్ అయ్యింది. మరోపక్క నెల్లిమర్ల ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకి పార్టీ తీరని ద్రోహం చేసిందని పోలిపల్లిలో కార్యకర్తలు విస్తృత సమావేశం అవడమే కాకుండా నడి రోడ్డుపై రచ్చకి దిగారు. విజయనగరం. చీపురపల్లి టిక్కెట్టు జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కేటాయించకపోవటంతో అయన అయన అనుచరులు నిరసనలు తెలుపుతున్నారు. 

చీపురపల్లిలో టీడిపి ప్రచార సామగ్రిని అగ్నికి ఆహుతి చేసిన నేతలు, కార్యకర్తలు. అంతేకాకుండా నాలుగు మండలాలకు చెందిన టిడిపి అధ్యక్షులు పార్టీ పదవులకు రాజీనామ చేసేసారు. 

TDP:

TDP final list 

Tags:   TDP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ