ఒకప్పుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. దళిత, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం సుతరామూ ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని పక్కనపెడుతూనే ఉన్నారు అనే ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.
సీఎం జగన్ ఎక్కువగా దళితులకే ప్రాధ్యానత ఇస్తూ ఉంటారు.. అంతో వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఈక్రమంలోనే సింగనమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు... మడకశిరకు ఉపాధిహామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేసారు. అత్యంత సాధారణమైన వాళ్ళను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో జగన్ ఈ సంఘటనతో స్పష్టంగా చెప్పారు. గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు.
ఇప్పుడు కూడా పేదవర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి జగన్ తన వైఖరిని మరోసారి వెల్లడించారు. కానీ టీడీ అధినేత చంద్రబాబు అవహేళన చేస్తున్నారు. ఒక టిప్పర్ డ్రైవరుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా అని బాబు చేసిన కామెంట్స్ పట్ల ప్రజలు.. ఆయా దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సీఎం వైయస్ జగన్ సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి వీరాంజనేయులు ఎం ఏ , బీఈడీ చదివారు. కానీ చంద్రబాబు మూడుసార్లు సీఎం అయినపుడు కూడా ఉద్యోగావకాశాలు లేక.. అప్పట్లో కుటుంబ పోషణార్థం టిప్పర్ డ్రైవర్ గా పని చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పదని అంటున్నారు.