రాష్ట్రంలో జగన్ గాలి బాగా వీస్తుంది.. అనిపించేలా ఆయన చేస్తున్న మేమంతా సిద్ధం యాత్ర కి తరలివస్తున్న ప్రజనీకాన్ని చూస్తే అర్ధమవుతుంది. జగన్ ఎక్కువ బలంగా ఉండే రాయలసీమలోనే ఆయనకు ఆదరణ ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు రాయలసీమకి మించి జగన్ పై మించి గుంటూరు, కృష్ణా ప్రజల అభిమానం చూపిస్తున్నారు.
ఆయనపై రాయి దాడి జరిగిన తర్వాత జగన్ నిన్న కేసరపల్లిలో విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈరోజు 15వ రోజు గన్నవరంలో
మేమంతా సిద్ధం యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ అడుగు పెట్టిన దగ్గర నుండి జనం ప్రభంజనంలా పెరుగుతూ వెళ్తుంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు.
మరి జగన్ పై ప్రజాభిమానం చూస్తుంటే మరోసారి ఏపీలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు.