ఏపీలో ఎలక్షన్స్ హీట్ అంతకంతకు పెరిగిపోతుంది. ఈ ఎన్నికల్లో అధికార పక్షం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.. లేదంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోపక్క నేషనల్ మీడియా దగ్గర నుంచి న్యూస్ ఛానల్స్ వరకు సర్వే లో పోల్స్ అంటూ ఊదరగొడుతున్నాయి. ఎటు చూసినా మళ్ళీ ఏపీలో వైసీపీ దే హవా కనబడుతుంది. మళ్ళీ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది అని చాల సర్వే లు తేల్చి చెబుతున్నాయి.
తాజాగా నేషనల్ మీడియా సర్వే లో NDTV Poll of Polls 2024 లో YSRCP : 16 ఎంపీ సీట్స్ గెలుచుకుంటుంది అని.. NDA కూటమి(BJP+TDP+JSP) : 9 ఎంపీ సీట్స్ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పడంతో.. ఏపీలో మరోమారు వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎంపీ సీట్స్ ఎక్కువ వస్తే.. ఎమ్యెల్యే సీట్స్ కూడా ఎక్కువే వస్తాయి.. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటున్నారు.
2024లో ఏపీలో వైసీపీదే విజయం అని తేల్చేసిన NDTV సర్వే తో జూన్ లో ప్రమాణస్వీకారం ఎక్కడ జరపాలి అనే చర్చల్లో అప్పుడే వైసీపీ శ్రేణులు మునిగిపోయాయి.