గత ఐదేళ్లుగా ప్రతినెలా ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పేద, ముసలి వాళ్లకి పిన్షన్లు అందించే వాలంటీర్ల మీద టీడీపీ నేతలు కక్ష గట్టారు. రాష్ట్రంలోని దాదాపు 70 లక్షలమంది పెన్షనర్ల పాలిట టీడీపీ నేతలు ఒక యమకింకరుల్లా తయారయ్యారు అంటూ వైసీపీ నాయకులూ ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రతినెలా ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పిన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్షగట్టారు.. వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి.. తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం జగన్ పేరొచ్చేస్తుందో అని చంద్రబాబు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకుని తన పన్నాగం ఫలించిందని సంబరపడ్డారు.
అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం.. బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. దీంతో డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు.. ఇపుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని... వృద్ధులు... వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ డిమాండ్ చేస్తున్నారు.
పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది.. ఆ తరువాత వాళ్లపట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబే... ఓటరులారా ? చూస్తున్నారా ? చంద్రబాబు కుట్రలు.. మేలుకోండి అంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు.