నిజానిజాలు దాచేసి విష ప్రచారం చెయ్యడంలో చంద్రబాబు గురువు రామోజీ రావు దిట్ట అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ నిజాలు, ఎదుటి వాడు చెప్పేవి అబద్దాలు అంటూ కప్పి పుచ్ఛి చూపించే రామోజీ రావు ఎలాంటి వాడో అనేది ప్రజలు గమనించాలి.. అంటూ వైసీ నేతలు ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు.
గతంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది.. కానీ ఇప్పుడు అదే మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..? ఇది రామోజీ కుట్ర కాదా.. చంద్రబాబు ని మంచిగా చూపించేందుకు రామోజీ ఎంత నీచానికైనా దిగజారుతాడు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక్కడే అసలు విషయం అర్థమవుతుంది.. వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయాందోళన లకి గురి చేసి వారిని కంఫ్యుజ్ చేస్తూ టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అస్త్రంగా వాడుతున్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు అంటూ వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు.
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అడ్డం పెట్టుకుని కావాలనే ప్రజలను తప్పు దోవ పట్టించడం చాలా బాధాకరం కానీ ప్రజలు టీడీపీ, ముఖ్యంగా రామోజీ విష ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు.. ఈ ఎన్నికల్లో మీరేం చేసినా మీ ఆటలు సాగవు, ఈసారి కూడా వైసీపీదే ప్రభుత్వం అంటూ వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు