Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: నందమూరి కళ్యాణ్‌రామ్‌

Tue 03rd Feb 2015 06:53 AM
patas movie,kalyan ram,patas review,kalyan ram interview  సినీజోష్‌ ఇంటర్వ్యూ: నందమూరి కళ్యాణ్‌రామ్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: నందమూరి కళ్యాణ్‌రామ్‌
Advertisement
Ads by CJ

‘అతనొక్కడే’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ దాదాపు పదేళ్ళ తర్వాత ‘పటాస్‌’తో మరో కమర్షియల్‌ హిట్‌ సాధించాడు. తను చేసే ప్రతి సినిమా రొటీన్‌కి భిన్నంగా వుండాలని కోరుకునే హీరోల్లో కళ్యాణ్‌రామ్‌ మొదటివాడు అని చెప్పాలి. సినిమా సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాలు అందించాలని తాపత్రయపడే కళ్యాణ్‌రామ్‌ ఈ పదేళ్ళలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో నిర్మించి నిర్మాతగా కూడా తన ఉత్తమాభిరుచిని తెలియజేసారు. అనిల్‌ రావిపూడిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించి నిర్మించిన ‘పటాస్‌’ ఇటీవల వరల్డ్‌వైడ్‌గా విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సూపర్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ..

దాదాపు పదేళ్ళ తర్వాత బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ని అందుకున్నారు. దీనిపై మీ స్పందన?

పదేళ్ళ తర్వాత సూపర్‌హిట్‌ అనే మాట వినడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ పది సంవత్సరాల్లో నేను ఏం నేర్చుకున్నాననేది చాలా ఇంపార్టెంట్‌. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ అనేవి అందరికీ వుంటాయి. అది చాలా కామన్‌. ఫెయిల్యూర్‌ వచ్చినపుడు మనల్ని మనం ఎనలైజ్‌ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకొని ధైర్యం కోల్పోకుండా మనమీద మనం కాన్ఫిడెన్స్‌ పెంచుకొని ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది ముఖ్యం. ఈ పది సంవత్సరాల్లో అది నేను నేర్చుకున్నాను. 

ఈ సినిమా సక్సెస్‌ కోసం ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?

అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాను. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఓం సినిమాకి ఎక్కువ కష్టపడ్డాను. అది ఫెయిల్‌ అయింది. అలా అని నిరాశపడకూడదు. ‘పటాస్‌’ విషయానికి వస్తే చాలా ఆడుతూ పాడుతూ చేశాను. సూపర్‌హిట్‌ అయింది. వర్క్‌ విషయంలో ఎలాంటి తేడా లేదు. అన్ని సినిమాలూ సూపర్‌హిట్‌ కావాలనే పనిచేస్తాం. అయితే ఫెయిల్యూర్స్‌లో ఎలాంటి తప్పులు చేశామనేది తెలుసుకుంటే తర్వాత అలాంటి తప్పుడు చెయ్యకుండా వుండొచ్చు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఆడియన్స్‌ ఏం కోరుకుంటున్నారు, మనం ఎలాంటి సినిమా వారికి ఇవ్వాలి అనేది ఆలోచించి దాని ప్రకారమే చేశాం. ఆడియన్స్‌ దాన్ని యాక్సెప్ట్‌ చేశారు. 

మీరు కష్టపడి చేసిన ‘ఓం’లో ఎలాంటి తప్పులు జరిగాయనుకుంటున్నారు?

కథగా చూస్తే ‘ఓం’ మంచి కథ. కానీ, ఆడియన్స్‌ మీద చాలా బర్డెన్‌ పడిపోయింది. ఎలా అంటే మొదటి సీన్‌లో ఒకటి చెప్తాను, ఆ తర్వాత ఇరవయ్యో సీన్‌లో మొదటి సీన్‌లో నేను ఒక విషయం చెప్పాను గుర్తుందా అని అడుగుతాను. ఆడియన్స్‌ మీద అంత బర్డెన్‌ పెట్టడం కరెక్ట్‌ కాదు. ఆడియన్స్‌ సినిమాకి వచ్చేది వారి మైండ్‌ రిలాక్స్‌ అవడం కోసం. అది యాక్షన్‌ మూవీ కావొచ్చు, లవ్‌స్టోరీ కావచ్చు, కామెడీ మూవీ కావచ్చు. ఏదైనా వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి. ఓమ్‌తో అది నేను రియలైజ్‌ అయ్యాను. 

వరసగా వచ్చిన ఫ్లాపుల వల్ల ఇక సినిమాలు చెయ్యొద్దని ఎప్పుడైనా అనుకున్నారా?

నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. డిజప్పాయింట్‌ అయివుండొచ్చు. నేను మూడీగా వుంటే మా ఫ్యామిలీ, కొంత మంది ఫ్రెండ్స్‌ నాకు ధైర్యం చెప్పేవారు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ అనేవి మామూలు విషయాలు, నువ్వు ఇలా చెయ్యి అని నాకు ధైర్యం చెప్పేవారు. నాకు ఎనర్జీని ఇచ్చింది వాళ్ళే. అయితే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని మాత్రం అనుకోలేదు. నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆ నమ్మకం నాకు వుంది. అయితే దానికి టైమ్‌ పడుతుంది. దాని కోసమే కృషి చేశాను. 

‘పటాస్‌’ సక్సెస్‌ మీకెలాంటి ఉత్సాహాన్నిచ్చింది?

ఉత్సాహాన్ని కాదు, బాధ్యతను మరింత పెంచింది. నెక్స్‌ట్‌ టైమ్‌ ఈ సినిమా కంటే బెటర్‌ మూవీ తియ్యాలనే బాధ్యతను నా ముందు వుంచింది. ఇకపై చెయ్యబోయే సినిమాలు ఎలా వుండాలన్న విషయంలో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఇది ఈ సినిమాతో వచ్చింది కాదు ఓమ్‌ టైమ్‌లోనే ఆ డెసిషన్‌కి వచ్చాను. ఏది చేసినా ఆడియన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని చెయ్యాలి. మనం చెయ్యాలనుకున్న సినిమాలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఏమైనా ఇవ్వగలమా అనేది దృష్టిలో పెట్టుకొని ఇకపై సినిమాలు చేస్తాను. 

అనిల్‌ చెప్పిన స్టోరీలో మిమ్మల్ని ఇంప్రెస్‌ చేసిన అంశాలు?

రెండు గంటలు ఈ స్టోరీ నాకు నేరేట్‌ చేశాను. నాకు బాగా నచ్చింది. అతను చెప్పిన సీన్స్‌ విని బాగా నవ్వుకున్నాను. ఒక ఆడియన్‌గా బాగా ఎంజాయ్‌ చేశాను. నాకు అనిల్‌ మీద ఒపీనియన్‌ లేదు. ఒక డైరెక్టర్‌ మీద ఒపీనియన్‌ వుంటే అతను ఎలా చెప్తున్నాడనేది మనం ఎనలైజ్‌ చేసుకుంటాం. కానీ, కొత్తవాడు ఆ కథ ఏమిటో కూడా నాకు తెలీదు. రెండు గంటలు చెప్తూనే వున్నాడు. నేను దాన్ని ఎంజాయ్‌ చేస్తూనే వున్నాను.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ఈ సినిమాతోపాటే చేసిన ‘షేర్‌’ మేలో రిలీజ్‌ అయ్యే అవకాశం వుంది. దానికి సంబంధించి ఐదు పాటలు కొన్ని సీన్స్‌ బ్యాలెన్స్‌ వున్నాయి. అవి కూడా పూర్తి చేసి మేలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. నేను ఒకేసారి రెండు సినిమాలు చేస్తానని అనుకోలేదు. పటాస్‌ రిలీజ్‌ అయిది. ఇప్పుడు షేర్‌ రిలీజ్‌ అవ్వాల్సి వుంది. మరో పక్క నా బేనర్‌లో ‘కిక్‌2’ జరుగుతోంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు నందమూరి కళ్యాణ్‌రామ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ