Advertisementt

మల్టీ స్టారర్‌ కాదు..అంతకుమించి!!

Thu 12th Feb 2015 07:22 AM
nagarjuna,kaarthi,malli malli idi rani roju,eega  మల్టీ స్టారర్‌ కాదు..అంతకుమించి!!
మల్టీ స్టారర్‌ కాదు..అంతకుమించి!!
Advertisement
Ads by CJ

ఒక హీరో అయినా, పది మంది హీరోలయినా ఆ భాషాభిమానులే ఆ సినిమా చూస్తారు. చిత్ర నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్క తెలుగు మార్కెట్‌తో సినిమా వర్కవుట్‌ అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. పరభాషామార్కెట్‌ని సంపాదించాలి. ఒకప్పుడు ఎస్వీఆర్‌-సావిత్రి-జానకి-అక్కినేనికి తమిళంలోను, శారదకి మలయాళంలోను, జయప్రద- శ్రీదేవికి దక్షిణాది భాషలతోపాటు హిందీ మార్కెట్‌ వచ్చింది. శివాజీ గణేశన్‌కి తమిళంతోపాటు తెలుగు మార్కెట్‌ కూడా వుంది. రజనీకాంత్‌-కమల్‌-సూర్య తాజాగా ధనుష్‌ ఆల్‌ ఇండియా మార్కెట్‌ సంపాదించారు. ఆ క్రమంలో నాగార్జున, వెంకటేష్‌ కనిపిస్తారు. అల్లు అర్జున్‌కి మలయాళీ మార్కెట్‌ వుంది. నాగ్‌-కార్తీ కాంబినేషన్‌లో సినిమా మొదలయింది. శర్వానంద్‌, నిత్యామీనన్‌ ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ హిట్టయింది. తమిళ-మలయాళీ తారలను చేర్చుకోవడంవలన ఆ భాషలలో మార్కెట్‌ లభిస్తుంది.  నిర్మాతకు వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు మంచి ఉదాహరణ ‘ఈగ’. ఈ దిశగా ప్రయత్నాలు మొదలవడం తెలుగు సినిమాకి శుభసూచకం!

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ