Advertisementt

నాడు నగేష్‌ , నేడు రాజేంద్ర ప్రసాద్‌!

Thu 19th Mar 2015 07:27 AM
rajendra prasad,hitlar,chiranjeevi,nagesh actor,charlie chaplin,tommy  నాడు నగేష్‌ , నేడు  రాజేంద్ర ప్రసాద్‌!
నాడు నగేష్‌ , నేడు రాజేంద్ర ప్రసాద్‌!
Advertisement
Ads by CJ

రాజేంద్రుడు ‘గజేంద్రు’నితోనేగాదు, కుక్కతోనూ కోతితోనూ సీను పండిరచగలడు!

దక్షిణాదివాడయి నగేష్‌ - తెలుగువాడయి రాజేంద్రప్రసాద్‌ ఇలా మిగిలిపోయారు గాని లేకుంటే చార్లీ చాప్లిన్‌తో వరల్డు సినిమా స్క్రీన్‌ మీద పోటీపడేవారు.‘‘హిట్లర్‌’’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన చిరంజీవికి ఆన్‌ స్క్రీన్‌ - ఆఫ్‌ స్క్రీన్‌ రాజేంద్రప్రసాద్‌ ఇచ్చిన మోరల్‌ సపోర్టు చాలా కొద్దిమందికే తెలుసు.  సెకండ్‌ ఇన్సింగ్స్‌ ఆరంభిస్తున్న ఏ హీరో అయినా సందేహించడం సహజం. ఆ సమయంలో చిరంజీవి అంతటివాణ్ణి కన్విన్స్‌ చేసిన మేధావి రాజేంద్రప్రసాద్‌.

‘రాజేంద్రుడు - గజేంద్రుడు’లో ఏనుగుతో, ‘లింగబాబు లవ్‌స్టోరీ’లో కోతిపిల్లతో వెండితెరని పండిరచిన నటకిరీటి ‘టామీ’తో మరోమారు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఒక చార్లీ చాప్లిన్‌ -ఒక నగేష్‌ - ఒక రాజేంద్రప్రసాద్‌ : ఒకరే వుంటారు; వేరొకరు వారి దగ్గరకుకూడా రాలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు - గాయకుడు కీర్తిశేషులు ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌ ` తాను రాజేంద్రప్రసాద్‌ అభిమానినని సగర్వంగా చెప్పేవారు. రాజ్‌కుమార్‌ పర్సనల్‌ లైబ్రరీలో రాజేంద్ర ప్రసాద్‌ సినిమాలన్నీ వున్నాయి. నేటికీ ప్రతిరోజూ ఏదో ఒక టివి ఛానల్‌లో రాజేంద్రప్రసాద్‌ సినిమాలు ప్రసారమవుతూనే వుంటాయి. వాటికి మంచి రేటింగ్స్‌ వస్తున్నాయి.

‘టామీ’ తర్వాత రాజేంద్రప్రసాద్‌ అమల వలె మూగ జీవాల సంరక్షణకు ప్రచారకర్తగా వ్యవహరించినా మనం ఆశ్చర్యపోనవసరంలేదు. మళ్ళీ రాజేంద్రప్రసాద్‌ వేగాన్ని పుంజుకోవడం తెలుగు సినిమాకి శుభపరిణామం. హీరోపాత్రలు పోషిస్తున్న యువ కమెడియన్స్‌కి రాజేంద్రప్రసాద్‌ ‘టైమింగ్‌’, ‘పంక్చువాలిటీ’, నిర్మాత సేఫ్టీ ఆదర్శం. అన్ని సినిమాలు చేసినా ‘స్టేల్‌’ కాని ఆయన అభినయం అధ్యయనీయం!

- తోటకూర రఘు