Advertisementt

చిన్న చిన్న ప్రయోగాలకు పెద్ద అండ - దండ!

Thu 26th Mar 2015 04:16 AM
manchu lakshmi,chandamama kathalu,national award  చిన్న చిన్న ప్రయోగాలకు పెద్ద అండ - దండ!
చిన్న చిన్న ప్రయోగాలకు పెద్ద అండ - దండ!
Advertisement
Ads by CJ

ప్రయోజనాత్మక - ప్రబోధాత్మక చిత్ర దర్శకుల ఫస్ట్‌ ఛాయిస్‌ : షబానా ఆజ్మీ - ‘ఊర్వశి’ శారద - స్మిత పాటిల్‌.

జావెద్‌ అక్తర్‌ని పెళ్ళాడిన తర్వాత సాహిత్యానికి - సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకి అంకితమయింది; ‘‘రాగా’’ వంటి అద్భుతమైన చిత్రాలలో అడపాదడపా కనిపిస్తోంది షబానా!

షబానాని గుర్తుకుతెచ్చే అద్భుత నటి - నిర్మాత - తెలుగు, ఇంగ్లీషు టివి షోస్‌ యాంకర్‌ : మంచు లక్ష్మి.

‘‘చందమామ కథలు, గుండెల్లో గోదారి, కాదల్‌, అనగనగా ఓ ధీరుడు, దూసుకెళ్తా, దొంగలముఠా, డిపార్ట్‌మెంట్‌, పెర్‌ఫెక్ట్‌ లైవ్స్‌, డెడ్‌ ఎయిర్‌, థ్యాంక్యూ ఫర్‌ వాషింగ్‌’’ తదితర చిత్రాలలో నటించిన మంచు లక్ష్మి తాజాగా  ‘‘బాస్మతి బ్లూస్‌, బుడుగు, పిలవని పేరంటం’’ చిత్రాలకు పనిచేస్తోంది.

ఇంగ్లీషు - తెలుగు - తమిళ - హిందీ : ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని భాషలలో నటించడంకాదు, పాత్ర డిమాండుని బట్టి తనని తాను మలుచుకోవడం ఆమె గొప్పతనం.

ఆమెకు దర్శకుల - నిర్మాతల ఇబ్బందులు, అవసరాలు తెలుసు. ఆమె సహకారం మరువలేనిది అంటారు ఆమెతో పనిచేసిన దర్శక నిర్మాతలు. ఆమె మా ఫ్యామ్లీ మెంబరు అంటారు సాటి కళాకారులు.

క్రియేటివ్‌ థాట్‌తో వెళ్ళే దర్శకులను ఆమె ప్రోత్సహించే తీరు అమోఘం. ఒక షబానా ఆజ్మిని, ఒక శారదని ఒక స్మితా పాటిల్‌ని మంచు లక్ష్మిలో చూడవచ్చు. 

‘‘నేను మంచు లక్ష్మి తండ్రిని, మంచు మోహన్‌బాబుని’’ అని మోహన్‌బాబు సగర్వంగా చెప్పుకునేరోజు దగ్గర్లో వుంది.

శారద, షబానా ఆజ్మి, స్మితాపాటిల్‌కి కేరక్టర్‌ నచ్చితేచాలు; పారితోషికం పట్టించుకోరు - ఇది నిన్నటి మాట. 

కొత్త కాన్సెప్టుతో కుర్ర డైరెక్టరు వస్తే ‘నీకు నేనున్నా ప్రొసీడ్‌’ అంటున్నారు లక్ష్మి - ఇది నేటి మాట.

మంచు లక్ష్మి వంటి ఆర్టిస్టులుంటే తెలుగు సినిమాకి జాతీయ పురస్కారాలు ఖాయం!! 

- ఇది రేపటి మాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ