చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. అయితే ఈసారి చంద్రబాబు తన పర్యటనకు పలువురు పాత్రికేయుల్ని కూడా తీసుకుపోవడం విశేషం. సాధారణంగా రాష్ట్రపతి, ప్రధాని పర్యటనలకు మాత్రమే పాత్రికేయుల్ని తీసుకెళ్తారు. అయితే ప్రతిసారి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో తన పర్యటన ఆసాంతం పాత్రికేయుల్ని వెంట బెట్టుకొని తిరగాలని బాబు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి తాను ఇస్తున్న ప్రాధాన్యత గురించి కూడా ప్రజలకు తెలియజేయడానికే బాబు ఈసారి పాత్రికేయుల్ని తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక తన మొదటి రోజు పర్యటనలోనే బాబు పలువురు వ్యాపార దిగ్గజాలను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఇక ఈ పర్యటనలో చంద్రబాబు రాజధాని నిర్మాణం గురించి సింగపూర్ అధికారులతో చర్చిండమే ప్రధాన అజెండాగా ఉంది. ఇక సింగపూర్ పర్యటనకు చంద్రబాబు తన అనుకూల మీడియా ప్రతినిధుల్ని మాత్రమే తీసుకెళ్లారని, అన్ని మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఎందుకు తీసుకెళ్లలేదనే విమర్శలు వినబడుతున్నాయి. ఇక అన్ని మీడియా సంస్థల ప్రతినిధుల్ని తీసుకెళ్తే వారికే రెండు ప్రత్యేక విమానాలు కావాలనేది టీడీపీ వర్గాల వాదన.