అనధికారికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగులను తొలగించాలన్న హైకోర్టు ఉత్తర్వు అభిలషణీయం. రహదారి మధ్యలో అడ్డంగా ఏర్పాటు చేసిన నాయకుల విగ్రహాలు, ప్రార్ధనా మందిరాలు, మండపాలను కూడా తొలగించి ఎవరికీ ఇబ్బందిలేకుండా పక్కకు తరలించాలి. నాయకుల జయంతి వర్ధంతులకు దండలేసే వారితో రహదారులు దిగ్బంధానికి గురవుతున్నాయి. అలాగే ప్రార్ధనా మందిరాలు, మండపాలు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించడమేకాక భక్తుల వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యని సృష్టిస్తోంది. గృహాలకు, దుకాణాలకు పార్కింగ్‌ప్లేస్ చూపించమని ఒత్తిడిచేసే అధికార యంత్రాంగం ఈ ప్రార్ధనా స్థలాలు, మండపాలు, వేదికలకు పార్కింగ్ ప్లేస్ చూపించమని ఆ దేవాలయాల, మందిరాల నిర్వాహకులను ఒత్తిడిపెట్టాలి. పార్కింగ్ ప్లేస్‌లేని ప్రార్ధనా స్థలాలు, మందిరాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది. అడ్డ‘మైన’ విగ్రహాలను, ప్రార్ధనా మందిరాలనూ తొలగించాల్సిందే. వీటివలనే ట్రాఫిక్ సమస్య, మత కలహాలు, నిర్బంధ వసూళ్ళు జరుగుతున్నాయి.
- తోటకూర రఘు