కేంద్రమంత్రి సుజనాచౌదరికి మళ్లీ తలనొప్పి మొదలైంది. ఈయన కంపెనీకి లోన్ ఇచ్చిన మారిషస్ బ్యాంకు మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. మారిషస్ బ్యాంక్ నుంచి సుజనా యూనివర్సిల్ కంపెనీ రూ. 105 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించని సంగతి తెలిసిందే. సరిగ్గా సుజనాకు కేంద్రమంత్రిగా అవకాశం వచ్చే సమయానికి మారిషస్ బ్యాంకు హైకోర్టు తలుపుతట్టింది. అప్పటికే ప్రమాణ స్వీకారం జరిగిపోవడంతొ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. లేకపోతే మోడీ తన మంత్రివర్గంలో సుజనాకు అవకాశం ఇచ్చేది కూడా డౌటేనన్న వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణనను వేగవంతం చేయాలని మారిషస్ బ్యాంకు మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దాదాపు నాలుగు నెలలుగా ఈ కేసును అడ్మిట్ చేసుకునే విషయంలో కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిందని, వెంటనే తీర్పునివ్వాలని కోరింది. తమ మధ్య రాజీ చర్చలు విఫలమైనందునా వెంటనే సుజనా కంపెనీని మూసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, ఆ కంపెనీ యాజమన్యానికి స్తంభిచిన బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయాలని కోరింది. ఒకవేళ మారిషస్ బ్యాంకు కోరినట్లు సుజనా యూనివర్సిల్ కంపెనీని మూసివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరిస్తే కేంద్రమంత్రి చౌదరిగారికి కష్టాలు తప్పవేమో..!