Advertisementt

ఏమైనా మోడీ నే మార్చాలి..!!

Thu 23rd Apr 2015 02:44 AM
narendra modi,indai,terrorist country,change with modi  ఏమైనా మోడీ నే మార్చాలి..!!
ఏమైనా మోడీ నే మార్చాలి..!!
Advertisement
Ads by CJ

మోదీ హయాంలోనే జరిగితే మంచి జరగాలి, లేకుంటే భారత్‌ ఓ టెర్రరిస్టు దేశమవుతుంది

పారిశ్రామికంగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలన్నిటినీ పక్కకుతోసి ముందుకు మున్ముందుకు దూసుకుపోతున్న చైనా ఎవరెస్ట్‌ శిఖరంలో సొరంగం చేసి నేపాల్‌కి రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ మీదుగా 2.89 లక్షల కోట్లతో 3,000 కిలోమీటర్ల మేర చైనా - పాక్‌ కారిడార్‌ ఏర్పాటు చేయబోతున్నది. యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలతో తన ‘అణు’ బంధాన్ని బలోపేతం చేస్తున్న చైనా భారత్‌ని చక్రబంధంలో బిగించనున్నది.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గత పదేళ్ళ కాలాన్ని భారత్‌ దుర్వినియోగం చేసింది. ఇరుగుపొరుగు దేశాలతో ఆర్ధిక స్నేహ వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను దిగ్బంధం చేసింది. వెయ్యికోట్ల భారత జనాభాని పోషించాలి, ఉద్యోగాలు చూపించాలి, అభివృద్ధిలో చైనాతో పోటీపడాలి, రాజకీయ శక్తిగా ఎదగాలంటే మోదీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మోదీ చర్యలను ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. రాజ్య సభలో మోకాలడ్డవచ్చు. మోదీ హయాంలోనే ఈ దేశానికి ఏదైనా మేలు జరిగితే జరగాలి. భారత ప్రజలు ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే టెర్రరిస్టులు, స్మగ్లర్లు, రేపిస్టులు, సంఘ విద్రోహ శక్తులు పెచ్చుమీరతారు. భారత భవిష్యత్తుకి ఇదో పరీక్షా సమయం. మోదీకి అండగా యువత నిలబడాల్సిన సమయమిది.

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ