Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాగర్‌ మహతి

Wed 29th Apr 2015 05:33 AM
music director sagar mahathi,manisharma son sagar mahathi,jadugadu movie,hero naga showrya,director yogesh  సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాగర్‌ మహతి
సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాగర్‌ మహతి
Advertisement
Ads by CJ

మణిశర్మ.. ఈ వ్యక్తి గురించి సంగీత ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోలందరి సినిమాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని అందించి సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్నారు. ఇప్పుడు మణిశర్మ సంగీత వారసుడిగా ఆయన తనయుడు సాగర్‌ మహతి ‘జాదూగాడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాగశౌర్య హీరోగా యోగేష్‌ దర్శకత్వంలో సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు సాగర్‌ మహతితో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

మీ మొదటి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ఎలా వుంది?

ఈ సినిమా చేయడం నిజంగా చాలా అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. కీబోర్డ్‌ ప్లేయర్‌గా, ప్రోగ్రామర్‌గా వున్న నాకు ఈ సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం వచ్చిందంటే అది యోగిగారి వల్లే. నాకు బ్యాక్‌బోన్‌లా వుంటూ అన్ని విషయాల్లోనూ నన్ను సపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా యోగిగారికి, ప్రసాద్‌గారికి థాంక్స్‌ చెప్తున్నాను. ఈ సినిమా గురించి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వుంటుంది. మీ అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్‌ చెయ్యాలి. నా మొదటి సినిమా ఆడియో ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. వారి నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

సంగీత దర్శకుడిగా మణిశర్మగారికి ఒక ప్రత్యేకత వుంది. మ్యూజిక్‌లో మీ స్పెషలైజేషన్‌ ఏమిటి?

చేసే మూవీ జోనర్‌ మీద స్పెషలైజేషన్‌ అనేది ఆధారపడి వుంటుంది. ఒక్కో సినిమా ఒక్కో జోనర్‌లో వుంటుంది. ఆ జోనర్‌కి తగ్గట్టుగా అడాప్ట్‌ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ ఇంపార్టెంట్‌ అని నా ఉద్దేశం. అయితే ప్రోగ్రామింగ్‌లో కొంత స్పెషలైజేషన్‌ చెయ్యగలిగానని మాత్రం చెప్పగలను. 

మీ నాన్నగారికి, తాతగారికి బ్యాక్‌గ్రౌండ్‌ వుంది కాబట్టే మీరు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాలనుకున్నారా?

అవునండీ. నాకు చిన్నతనం నుంచి మ్యూజిక్‌ అంటే చాలా ఇంట్రెస్ట్‌. చాలా చిన్న ఏజ్‌లోనే నేను సంగీతం నేర్చుకోవడం స్టార్ట్‌ చేశాను. మా తాతగారు మ్యూజిషియన్‌గా వుండేవారు, నాన్నగారు కీబోర్ట్‌ ప్లేయర్‌గా పనిచేసేవారు. మాకు స్టూడియో కూడా వుంది. చిన్నప్పటి నుంచి నన్ను స్టూడియోకి తీసుకెళ్ళేవారు. అలా నాకు మ్యూజిక్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఏర్పడిరది. 

మీ మీద ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్‌ ఎక్కువగా వుంటుంది?

నామీద డెఫినెట్‌గా నాన్నగారి ఇన్‌ఫ్లుయెన్స్‌ 80 శాతం వుంటుంది. మిగతా 20 శాతం కళ్యాణి మాలిక్‌గారిది వుంటుంది. ఆయన దగ్గర ఎక్కువ సినిమాలకు పనిచేశాను. డెఫినెట్‌గా ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌ కూడా నాపై వుంటుంది. 

మీరు పర్సనల్‌గా ఎవరి మ్యూజిక్‌ని ఇష్టపడతారు?

డెఫినెట్‌గా నాన్నగారి మ్యూజిక్‌ అంటే ఇష్టం. అలాగే కళ్యాణి మాలిక్‌గారి సంగీతం కూడా ఇష్టపడతాను. కానీ, నేను యువన్‌ శంకర్‌రాజాకి గ్రేట్‌ ఫ్యాన్‌ని. 

మెలోడీ పాటలంటే మణిశర్మగారి గురించే అంతా చెప్తారు. మీకు పర్సనల్‌గా ఎలాంటి పాటలు చేయడం ఇష్టం?

నాకు అన్ని రకాల పాటలు ఇష్టమే. ఒక్కో మూడ్‌కి ఒక్కో సాంగ్‌ వుంటుంది. మెలోడీ పాటలంటే అందరూ ఇష్టపడతారు. అయితే అది ఏ పాట అనేది కాదు నేను మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేస్తాను. ఎలాంటి పాటైనా నాకు ఇష్టమే. 

మీ వర్క్‌ విషయంలో నాన్నగారి సలహాలు తీసుకుంటారా?

తప్పకుండా తీసుకుంటాను. నేను చేసిన ప్రతి ట్యూన్‌ నాన్నగారికి వినిపించేవాడిని. ఆయన ఇన్‌పుట్స్‌ కూడా ఇచ్చేవారు. నాకు తెలీని కొన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుంటూ వుంటాను. 

మీ పాటలు విజువల్‌గా చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది?

చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. అన్ని పాటల్ని చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. ముఖ్యంగా, ఎబిసి, గోలచేద్దాం పాటలు నాకు విపరీతంగా నచ్చాయి. మ్యూజిక్‌ విన్నవాళ్ళు నాన్నగారి పాటల్లాగే వున్నాయంటున్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ఎస్‌.వి.కె. ప్రొడక్షన్స్‌లో ఒక సినిమా చేస్తున్నాను. మధుగారు డైరెక్టర్‌. ప్రస్తుతం నేను లెర్నింగ్‌ ప్రాసెస్‌లో వున్నాను. నాకు తెలీకుండా ఏమైనా తప్పులు చేస్తే అందరూ క్షమించాల్సిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని నా మ్యూజిక్‌తో ఎంటర్‌టైన్‌ చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘జాదూగాడు’ సంగీత దర్శకుడు సాగర్‌ మహతి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ