Advertisementt

అదుర్స్ రఘు బర్త్ డే ఇంటర్వ్యూ..!

Mon 11th May 2015 06:55 AM
karumanchi raghava,adhurs movie,comedian,jabardasth show  అదుర్స్ రఘు బర్త్ డే ఇంటర్వ్యూ..!
అదుర్స్ రఘు బర్త్ డే ఇంటర్వ్యూ..!
Advertisement
Ads by CJ

2002 లో రిలీజ్ అయిన 'ఆది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2015 నాటికి 150 కి పైగా సినిమాలలో నటించిన కమెడియన్ కారుమంచి రాఘవ. మే 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి విలేకర్లతో ముచ్చటించారు.  

మీ బ్యాక్ గ్రౌండ్ గురించి..?

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్ వైఫ్. నాకొక బ్రదర్ ఉన్నాడు. తను ఫాబ్రికేషన్ ఇండస్ట్రీ రం చేస్తున్నాడు. నేను ఎమ్.బి.ఎ కంప్లీట్ చేసి సాఫ్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేసేవాడిని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.

సినిమాలపై ప్యాషన్ తో వచ్చారా..?

1995 నుండి దర్శకులు వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి నాకు మంచి స్నేహితులు. మాకు సినిమా డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే నీకు అవకాశం ఇస్తాం రఘు అని చెప్పేవారు. కాని నాకు సినిమాలపై ఆసక్తి ఏమి ఉండేది కాదు. ఏ రోజు సినిమా షూటింగ్ కు వెళ్ళలేదు. సినిమాలలోకి రావాలని అనుకోలేదు. వి.వి.వినాయక్ కు ఆ సమయంలోనే 'ఆది' సినిమా చేసే చాన్స్ వచ్చింది. బేసిక్ గా నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. వారి మనువడు నటించే సినిమాలో అవకాశం రాగానే ఓకే చేసేసాను. అప్పటి నుండి నా సినీ ప్రయాణం మొదలయ్యింది. 

కమెడియన్ గా చేయడానికి కారణం..?

అందరితో సరదాగా మాట్లాడతాను. విభిన్నమైన 'యాస' లలో మాట్లాడగలను. తెలంగాణా, శ్రీకాకుళం, రాయలసీమ ఇలా అన్ని యాసలలో కొంచెం పట్టు ఉంది. సో.. ఏ సినిమా చూసిన తను ఇలా మాట్లాడాడు అని కామెంట్ చేసేవాడిని. అందమైన అమ్మాయిలని చూసి అక్క అనేవాడిని. ఒక్కొక్కసారి వారికి కోపం వచ్చేసేది. ఇలా అందరిని టీజ్ చేసేవాడిని. నాలో ఓ కామెడీ యాంగల్ ఉందని వి.వి.వినాయక్ గుర్తించి మొదటి సినిమాలో కమెడియన్ గా చాన్స్ ఇచ్చారు. 

మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి..?

2002 లో స్టార్ట్ అయిన నా జర్నీ 2010 వరకు 38 సినిమాలు చేసాను. 2010లో రిలీజ్ 'అదుర్స్' మూవీతో నాకు మంచి పేరు వచ్చింది. అదుర్స్ తరువాత సుమారుగా 120 సినిమాలలో నటించాను. ఒక 2014లోనే పెద్ద హీరోలతో 25 సినిమాలు చేసాను. నా జీవితంలో బిగ్గెస్ట్ అచ్చీవ్మెంట్ అది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాన్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం వాళ్ళతో ఖచ్చితంగా నటించే చాన్స్ వస్తుందని భావిస్తున్నాను.

టివి షోస్ కూడా బానే చేసినట్లున్నారు..?

2003లో చాలా టివి షోస్ చేసాను. సుమారుగా 1800 ఎపిసోడ్స్ చేసాను. షార్ట్ ఫిల్మ్స్, మినీ మూవీస్, డైలీ సీరియల్స్ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేసాను. టివి నాకొక స్కూల్ లాంటిది. చాలా నేర్చుకున్నాను. 'జబర్దస్త్' షో తో హోం ఆడియన్స్ కు దగ్గరయ్యాను. ఆ షో లోనే 27 ఎపిసోడ్స్ చేసాను. 27 గెటప్స్ వేసాను. జబర్దస్త్ తో సినిమాలలో మంచి చాన్స్ లు వస్తాయనుకున్నాను. కాని నేను అనుకున్నట్లు జరగలేదు. అందుకే ఆ షో లో కంటిన్యూ చేయలేకపోయాను. 

కమెడియన్ గా చేయడం ఎలా అనిపిస్తుంది..?

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ కి కాంపిటిషన్ ఎక్కువ. దాదాపు 120 మంది కమెడియన్స్ ఉన్నారు. 

ప్రేక్షకులను నవ్వించడం అనేది చాలా కష్టమైన జాబ్. ప్రతి సినిమా కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. కాని కాంపిటిషన్ ఉంటేనే మనలో స్పీడ్ ఉంటుంది.

ఈ హీరోలతోనే చేయాలని ఏమైనా ఉందా..?

చిన్న, పెద్ద, కొత్త, పాత హీరోలు అనేం ఉండదు. అందరి హీరోలతో చేయాలనుంది. ఎవారికి వారికి వారి రేంజ్ లో అభిమానులు ఉంటారు. అందరి హీరోలతో చేస్తేనే ఆడియన్స్ కి రీచ్ అవుతాం. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాన్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం వాళ్ళతో ఖచ్చితంగా నటించే చాన్స్ వస్తుందని భావిస్తున్నాను. త్రివిక్రమ్, బోయపాటి శీను దర్శకులతో సినిమా చేయాలనుంది.

'కిక్2' సినిమాలో ఎలాంటి రోల్ చేస్తున్నారు..?

'కిక్2' లో ఓ ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నాను. సురేందర్ రెడ్డి ఈ యాంగల్ లో నిన్నెప్పుడు చూడలేదు. అధ్బుతంగా నటించావు అని అప్రిసియేషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ చేసే ఓ సినిమాలో  నెగటివ్ షేడ్ లో కనిపించనున్నాను. దాని కోసం నా బరువు కూడా తగ్గించుకున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

రిలీజ్ అవ్వడానికి 10 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవి కాకుండా రామ్ చరణ్, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో నటిస్తున్నాను. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుంది. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తాననే నమ్మకం ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ