Advertisementt

ఇండో - పాక్‌ క్రికెట్‌ సిరీస్‌కాదు..!

Wed 13th May 2015 06:43 AM
india verses pakisthan,cricket,hockey,cinema  ఇండో - పాక్‌ క్రికెట్‌ సిరీస్‌కాదు..!
ఇండో - పాక్‌ క్రికెట్‌ సిరీస్‌కాదు..!
Advertisement
Ads by CJ

ఇండో - పాక్‌ క్రికెట్‌ సిరీస్‌కాదు, ఇండ్‌ - పాక్‌ సంయుక్త చిత్ర నిర్మాణం చేపట్టాలి. క్రికెట్‌ మ్యాచ్‌లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం ఖాయం. ఇండో`పాక్‌ మధ్య ఏ పోటీ జరిగినా అది క్రికెట్‌ కావచ్చు హాకీ కావచ్చు. మరొకటి కావచ్చు. భావోద్వేగాలతో ముడిపడి వుంటాయి. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఓడిపోకుండా ఇరు దేశాలవారు ఆనందించేది, ఆస్వాదించేది సినిమా ఒక్కటే. ఇండో - పాక్‌ కళాకారులతో గాయనీ గాయకులతో చిత్ర నిర్మాణం చేపట్టడం చాలా అవసరం. భాషాపరంగా, భౌగోళిక పరంగా, సంస్కృతిపరంగా, భావోద్వేగాలపరంగా భారత్‌ - బంగ్లా - పాక్‌ - ఆఫ్ఘనిస్తాన్‌ ఒకే తాను ముక్కలు. భారత్‌ ఉపఖండంలో స్వాతంత్య్ర సమరాలు, ప్రాణాలర్పించిన చారిత్రక ప్రదేశాలు, చరిత్రలో మిగిలిపోయిన త్యాగ ధనులు ఎందరెందరో. ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జరిగిన ఆ స్వాతంత్య్ర సమర ఘట్టాలను నేపధ్యంగా తీసుకొని చిత్ర నిర్మాణం చేపట్టవచ్చు. పాక్‌నుంచి వచ్చి ముంబయిలో స్ధిరపడిన నటులు, దర్శక నిర్మాతలు, గాయనీ గాయకులు, రచయితలు ఎందరెందరో. సినిమా ఒక్కటే భారత ఉపఖండాన్ని ఉల్లాసంగా ఉంచగలదు. వైషమ్యాలను రూపుమాపగలదు. క్రికెట్‌ వైషమ్యాలను పెంచుతుంది, సినిమా తగ్గిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ