లోకేష్ సాధించాడు, అయినా సాధించాల్సింది ఇంకెంతో వుంది
నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయడంలో ప్రత్యేకించి రెండు వేల గ్రామాలను దత్తత తీసుకునేలా చేయడంలో ఘనవిజయం సాధించారు. అమెరికాలోని తెలుగు వారిలో సీమాంధ్రులు అధిక సంఖ్యాకులు కావడంవల్లనే ఇది సాధ్యమయింది. ఇదికాదు లోకేష్ నుంచి రేపటితరం ఆశించేది.
ట్రేడర్స్‌గా, కాంట్రాక్టర్సుగా మిగిలిపోయిన ఆంధ్రులు మాన్యుఫాక్చరింగ్ రంగంలో తమ సత్తా చాటాలి. పారిశ్రామికీకరణ జరగాలి. ఆంధ్రప్రదేశ్‌కి విస్తారమైన సముద్రతీరం వుంది, నదీ నదాలున్నాయి. జలమార్గాలను సద్వినియోగం చేసుకుంటూ ప్యాకేజీ ఇండస్ట్రీని మెరైన్ ఇండస్ట్రీస్‌ని నెలకొల్పేలా చూడాలి. పరిశ్రమలొస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తలసరి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయమనేది జీవనాధారం కాగూడదు, వ్యవసాయంతోపాటు ఇతర ఆదాయ వనరులుండాలి. రైతు జీవితానికి భద్రత కల్పించే దిశగా కృషి చేయాలి. అప్పుడే ఎన్టీఆర్ కలలుగన్న ‘రామరాజ్యం’ ఏర్పడుతుంది, రైతుల ఆత్మహత్యలు కనుమరుగవుతాయి.