దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మూడు పర్యాయాలు అందుకున్న ఒకే ఒక కుటుంబం కపూర్ ఫ్యామ్లీ. పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, శశి కపూర్‌ని ఫాల్కే పురస్కారాలు వరించాయి. ఆ స్థాయి గౌరవం తెలుగు దర్శకుడు పూరీ జగన్నాధ్‌కి దక్కింది. ‘మెగా స్టార్’ చిరంజీవి పోషించని పాత్ర, పండిరచని ‘రసం’ లేదు. అన్ని వర్గాల, అన్ని వయసుల అభిమానులున్నారు చిరంజీవికి. వారి అంచనాలను అందుకోవాలి. చిరంజీవికి భిన్నమైన శైలి పవన్ కళ్యాణ్‌ది. పవర్‌స్టార్ బాడీ లాంగ్వేజ్ వేరు. మెగా స్టార్, పవర్ స్టార్‌కి పూర్తిగా వైవిధ్యమయింది రామ్‌చరణ్, అల్లు అర్జున్ స్టైల్. ఈ నలుగురితో పనిచేయడం గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. రామ్‌చరణ్‌ని మెగాస్టార్ వారసునిగా పరిచయం చేస్తున్నప్పుడు అభిమానుల అంచనాలను అందుకోవడానికి పూరీ ఎంత ఎక్సర్‌సైజు చేశారో, ఇప్పుడు అంతకన్నా పదింతలు ఎక్సర్‌సైజు చేయాలి పూరీ. కారణం ఇది చిరంజీవి 150వ సినిమా, చిరంజీవి థర్డ్ ఇన్నింగ్స్. చిరంజీవి సినిమా అంటే ‘ఇంద్ర’ వలె అన్ని రసాలనూ ఆశిస్తారు ప్రేక్షకులు. ఏది ఏమైనా భారతీయ సినిమా చరిత్రలో దాదా సాహెబ్ ఫాల్కే వలె తెలుగు సినిమా చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హీరోలతో పనిచేసిన దర్శకునిగా పూరీ నిలిచిపోతారు.
‘జెమిని టెలివిజన్’కి సింగిల్ ఎపిసోడ్ డైరెక్టరుగా నాకు పరిచయమయిన పూరీ జగన్నాధ్ రోజురోజుకీ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదగడం మహదానందంగా వుంది. అంతకు మించి కథ ` కథనం ` సంభాషణలలో కొత్త కాన్సెప్టు క్రియేట్ చేయడం, తక్కువ వ్యవధిలో సినిమా పూర్తి చేయడం రియల్లీ గ్రేట్. పూరీలో ఓ బాలచందర్, ఓ దాసరి, ఓ రాఘవేంద్రరావు, ఓ మన్మోహన్ దేశాయ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇన్ని వైవిధ్యాల కలనేత పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధుని రథోత్సవానికి భక్తులు పోటెత్తినట్టు చిరంజీవి 150వ సినిమాకి అభిమానులు పోటెత్తడం ఖాయం. ఆల్ ది బెస్ట్ పూరీ...
-తోటకూర రఘు