పెట్టుబడులన్నీ హైదరాబాదులో పెట్టడంవలనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో నిలబడాల్సివచ్చింది. నవ్యాంధ్ర నిర్మాణంలో వికేంద్రీకరణ జరుగుతుందని పదే పదే ప్రకటనలిచ్చారు. కానీ రాజధాని పేరుతో వేల ఎకరాలను ‘భూ సేకరణ ఆర్డినెన్సు’తో రైతులనుంచి ప్రభుత్వం లాగేసుకుంటోంది. గుంటూరు జిల్లాలో భూములకు రెక్కలొచ్చాయి. వేలు లక్షలు పోయి కోట్లు పలుకుతున్నాయి. సామాన్యుడు ఇంటికోసం స్థలం కొనే స్థితి లేదు. ఒక్క గుంటూరు, నెల్లూరులోనే అభివృద్ధి కేంద్రీకృతమయివుంది. నెల్లూరు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జిల్లా స్మార్ట్ సిటీగా. బిజెపి కంచుకోట విశాఖ. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకీ ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను కేటాయించారు. రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఒక్క విశాఖ అభివృద్ధితో ఉత్తరాంధ్ర తృప్తి చెందుతుందా? వీటన్నిటినీ మించి రాష్ట్ర రాజధాని జిల్లాలో సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి వుందా? తెలంగాణలో జరిగిందే ఆంధ్రాలోనూ మళ్ళీ జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ సైలెంట్‌గా ఎందుకుండిపోయారు? ‘భూ సేకరణ ఆర్డినెన్సు’పై పవన్ కళ్యాణ్ స్పందించాలి.