చిన్న నిర్మాతలకు రామోజీ రావు అండ!
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాలకు అదరణ కొరవడుతోంది అన్న విషయం విదితమే.. పూర్వా పరాల్లోకి వెళితే కొందరు సినిమా థియేటర్లను తమ చేతుల్లోకి తీసుకుని మోనో పలిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు అనేది చిన్న నిర్మాతల ఆరోపణ. దీని మీద చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. నిరాహార దీక్షలు జరిగాయి. అయితే మోనోపలి అనేది అసత్యం ఇది మా వ్యాపారం అని సదరు థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న వారు వారి వాదనలు వినిపిస్తున్నారు.. అయితే ఒకసినిమా నిర్మాణం అనేది ఎలా సమిష్టిగా జరుపుకుంటారో ...సినిమా వ్యాపారంలో కూడా ఇదే సూత్రం అమలు కావలసిన అవసరం ఉంది. అయితే ఒకప్పటి నమ్మకం న్యాయం అనేది ప్రస్తుతం సమాజంలో కొరవడిన కారణంగా సమిష్టిగా జరపవలసిన సినిమా వ్యాపారం కొందరి స్వార్థం వల్ల దారి తప్పింది అని చెప్పక తప్పదు.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా సినిమా పరిశ్రమలో ఎలాంటి మార్పులు రాలేదు.. ఈ విధానాన్ని ఎలాగైనా మార్చాలని చాలా కాలంగా చిన్న నిర్మాతల తరుపున పోరాటం చేస్తున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు .. ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. చిన్ననిర్మాతల పరిరక్షణా సమితిని ఒక దాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రగామి సంస్థగా ఉంటున్న ఉషాకరణ్ మూవీస్,,తో పాటు ఈనాడు.. ఈటివి చానల్స్ ఛైర్మన్ రామోజీ రావు ఈ చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించే దిశగా వారికి తన మద్దతు తెలుపుతున్నారు.
సమస్యకు పరిష్కారం ఇలా చెయ్యాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కొందరు బడా బాబులు థియేటర్లను తాము లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు.. ఈ విధానం తప్పు అని చెప్పడానికి చట్ట బద్దత లేదు.. ఇది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మానవ సంబంధాల మీద ఆధార పడి ఉంటుంది. పెద్ద నిర్మాతల కబ్జాలో ఉన్న థియేటర్లలో చిన్న సినిమా రిలీజు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు .. ఆ పరిస్థితులు లేవు .. మరి ఈ పరిస్థితికి పరి ష్కారం ఏమిటి? అనే దిశగా చిన్న నిర్మాతలు చిన్న నిర్మాతల పరిరక్షనా సమితి ఒక పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అదేమిటంటే .. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను కలిసి కొన్ని మినీ థియేటర్లను ( అంటే యాభై నుండి మూడు వందల మంది ప్రేక్షకులు కూర్చునేందుకు సదుపాయంగా ఉండే రీతిలో ) నిర్మాంచడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఆలోచనను చిన్న నిర్మాతల పరిరక్షణా సమితి వారు రామోజీ రావు వద్దకు వెళ్ళి చెప్పగా వారు ఈ ప్రతి పాదన పట్ల సానుకూలంగా స్పందించడమే కాకుండా మీకు నేను అండగా నిలుస్తాను అని మాట ఇవ్వడం కూడా జరిగింది అని చిన్న నిర్మాతల పరిరక్షణా సమితి అధ్యక్షులు చదల వాడ శ్రీనివాసరావు చెప్పారు.. అంతే కాకుండా ఈ నెల 23 న సాయంత్రం ఆరు గంటలకు చిన్ననిర్మాతల పరిరక్షణా సమితి సభ్యులను రామోజీ ఫిలిం సిటీకి రావలసిందిగా ఆహ్వానం పలికారని ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రామోజీ రావు చిన్న నిర్మాతలతో కూర్చుని సాధక బాధకాలు తెలుసుకుని తాముకొత్తగా ప్రారంభించనున్న చిన్న థియేటర్ల నిర్మాణానికి ప్రభుత్వాలతో మాట్లాడి తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారని ఇది శుభ పరిణామంగా భావిస్తున్నామని .. చిన్న నిర్మాతల పరిరక్షణా సమితి అధ్యక్షులు చదల వాడ శ్రీనివాసరావు చెప్పారు.
ముక్తాయింపు
రామోజీరావు చిన్న నిర్మాతల సంక్షేమం పట్ల ధ్యాస ఉంచి వారి సమస్యలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారికి మద్దతు పలికి చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే విధంగా తమ తోడ్పాను అందిస్తే చిన్న సినిమాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చి చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల నిర్మాణాలు పెరిగి సినిమాను నమ్ముకుని ఉన్న కార్మికులకు .. చిన్న చిన్న నటీనటులకు చేతినిండా పని, కడుపు నిండా ఆహారం దొరికి పరిశ్రమ మళ్ళీ కళకళ లాడుతుందనడంలో సందేహం లేదు.. ఈ నెల 23 న రామోజీ ఫిలిం సిటీలో చిన్న నిర్మాతలతో జరుగనున్న భేటీ ఫలప్రదం కావాలని ఆశిద్దాం !
-పర్వతనేని రాంబాబు