ఊహించిన విధంగానే తెలంగాణ రాష్ట్ర తొలివార్షికోత్సవానికి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 2వ తేదీన ఈ విషయమై ఆదేశాలు జారీ అవుతాయని తెలుస్తోంది. దీంతో మొత్తం 28 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ విషయమై గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ప్రిన్సిపాల్ సెక్రెటరీ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ 8 నెలలపాటు శ్రమించి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విధివిధానాలు, ప్రభుత్వంపై పడే ఆర్థికభారం తదితర విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి పది రోజుల క్రితమే ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసినట్లు సమాచారం. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులను మాత్రమే మొదటిదశలో రెగ్యులరైజ్ చేయనున్నారు. రెండో దశలో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని, వారి ఐదేళ్ల సర్వీసు పూర్తికాగానే క్రమబద్ధీకరించనున్నారు. ఇక ఇదే సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే రెండు నెలల్లో కనీసం పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు