Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: డి.వెంకటేష్(365 డేస్)

Sat 23rd May 2015 11:30 AM
venaktesh,365days movie,nandu,ram gopal varma  సినీజోష్ ఇంటర్వ్యూ: డి.వెంకటేష్(365 డేస్)
సినీజోష్ ఇంటర్వ్యూ: డి.వెంకటేష్(365 డేస్)
Advertisement
Ads by CJ

నందు, అనైక సోఠి జంటగా డి.వి.క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డి.వెంకటేష్ నిర్మించిన సినిమా '365 డేస్'. మే 22న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకటేష్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

సినిమాను మొత్తం 130 థియేటర్లలో రిలీజ్ చేసాం. అన్ని చోట్ల నుండి మంచి స్పందన వస్తోంది. మల్టిప్లెక్స్, ఏ క్లాస్ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ బావుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మొదటిరోజు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

ఇలాంటి కథనే చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..?

నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. సినిమాల మీద ఇష్టంతో ఈ ఇండస్ట్రీ కి వచ్చాను. సినిమాను నిర్మిస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉండాలని అనుకున్నాను. అదే ఆలోచనతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా తీసాం. చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వలన భార్య భర్తలు మధ్య సంబంధాలు చెడిపోయి చివరకు విడిపోతున్నారు. ప్రేమ,పెళ్లి అనే అంశాలను టచ్ చేస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాను చూసిన వారిలో కొంత రియలైజేషన్ కలుగుతుంది. 

మొదటి సినిమానే రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ తో చేయడం ఎలా అనిపించింది..?

మొదటి నుండి నాకు రామ్ గోపాల్ వర్మ గారంటే చాలా ఇష్టం. గొప్ప దర్శకుడు. అలాంటి ఆయనతో మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అనుకోకుండా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాను కూడా అధ్బుతంగా తెరకెక్కించారు.

హారర్, థ్రిల్లర్ సినిమాలు చేసే వర్మ లాంటి దర్శకునితో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మూవీ ఎలా చేసారు..?

నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారి కెరీర్ లో క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందిన సినిమా ఇదే. ప్రస్తుతం వర్మ గారు మాఫియా, హార్రర్‌, క్రైమ్‌ తరహా చిత్రాలను వదిలేసి ఫ్యామిలీ ఎమోషన్స్‌, హ్యూమన్‌ రిలేషన్స్‌తో కూడిన కథలతోనే సినిమాలు చేస్తున్నారు. నేను కూడా ఫ్యామిలీ మూవీ చేయాలనుకున్నాను కనుకే ఈ సినిమా ఆయనతో చేయడం కుదిరింది. భవిష్యత్తులో కూడా రామ్ గోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.

నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి..?

ఒక సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌గా, ప్రేమికుడిగా, భర్తగా, భార్యా బాధితుడిగా అన్ని రకాల షేడ్స్‌ని నందు పెర్‌ఫెక్ట్‌గా చూపించాడు. అనైక సోఠి పెర్ఫార్మన్స్ కూడా బావుంది. తెరపై వారిద్దరు నిజమైన భార్య భర్తలుగానే కనిపించారు. పోసాని కృష్ణ మురళి గారు ప్రేక్షకులను బాగానే నవ్వించారు.

నిర్మాతగా మారడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు..?

ఓ నిర్మాతగా దిల్ రాజు గారంటే నాకు చాలా గౌరవం. ప్రతిదీ ఆలోచించి పక్కా ప్లాన్ తో సినిమాలు నిర్మిస్తారు. ఆయనను స్పూర్తిగా తీసుకొనే ఈ సినిమా చేసాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

భవిష్యత్తులో చేసే సినిమాలన్నీ 'యు' సర్టిఫికేట్ పొందే సినిమాలను మాత్రమే చేయాలనుకుంటున్నాను. నిర్మాతగా ప్రస్తుతం నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పెద్ద వంశి గారితో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మలయాళంలో మీరాజాస్మిన్ నటించిన ఓ చిత్రాన్ని తెలుగులో చేయనున్నాం.

 

 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ