Advertisementt

ప్రత్యేకహోదాపై దోబూచులాట మరెన్నాళ్లో..!!

Sun 24th May 2015 09:45 PM
arun jaitly,specialstatus,andhra pradesh,nda  ప్రత్యేకహోదాపై దోబూచులాట మరెన్నాళ్లో..!!
ప్రత్యేకహోదాపై దోబూచులాట మరెన్నాళ్లో..!!
Advertisement
Ads by CJ

ప్రత్యేక హోదా కేంద్రం ప్రభుత్వం దోబూచులాడుతోంది. బీజేపీ జాతీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై తేల్చకుండా సమాధానాలను దాటవేస్తున్నారు. తాజాగా కేంద్రమంద్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదాపై కొత్త రకమైన సమాధానం చెప్పారు.

విభజన చట్టంలో పేర్కొన్న ప్రతిఅంశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామన్న అరుణ్‌జైట్లీ ఏపీకి కావాల్సినన్ని అదనపు నిధులు ఇస్తున్నందునా 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. అయితే ఏయే శాఖలకు సంబంధించి ఏమేర కేంద్రం ప్రత్యేక నిధులు ఏపీకి కేటాయించిదన్న విషయంలో మాత్రం సగటు ఆంధ్రప్రదేశ్‌వాసికి స్పష్టత కరువైంది. ప్రత్యేక హోదాపై గట్టిగా నిలదీస్తే.. ఓ కేంద్రమంత్రి అంశాన్ని పరిశీలిస్తున్నామని సమాధానం చెబితే.. మరోమంత్రి ఆ అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు. ఇక ఈ అంశంపై స్పందించాల్సిన అరుణ్‌జైట్లి డొంకతిరుగుడు సమాధానంతో నెట్టుకొస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ఆ అంశాన్ని పరిశీలించలేదు సరే.. 15వ ఆర్థిక సంఘమైన ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తుందా..? ఇది అరుణ్‌జైట్లీ కచ్చితంగా చెప్పగలుగుతారా..? లేక సోనియా గాంధీలాగే ఈ అంశాన్ని తదుపరి వచ్చే కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తారా..?. ఇలా ఆలోచిస్తా ఉంటే అనుమానాలకు అంతే ఉండదు. ఇలా ఆలోచనల్లో ఏపీ ప్రజలను పడేసి పుణ్యకాలం కాస్త బీజేపీ గడిపెస్తుంది.. చంద్రబాబు చూస్తూ ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రౌగు మెత్తనైతే గుర్రం మాట వింటుందంటారా..?.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ