ెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయడానికి హైదరాబాద్‌నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ గుట్టకు బయలుదేరారు. అయితే నగర శివారులోని బీబీ నగరం మండలం కొండమడుగు వద్ద సీఎం కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించడంతో వెనుక వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఇలా ఒకదాని ఒకటి కాన్వాయ్‌లోని వాహనాలు ముందువెళ్తున్న వాహనాలను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
యాదాద్రి అభివృద్ధి పనుల శంఖుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి కూడా హాజరయ్యారు. యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికపై కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడినుంచి హెలిక్యాప్టర్‌లో మెదక్ జిల్లా గజ్వేల్ మండలానికి వెళ్లనున్నారు.