రాముడికి లంకా నగరంకన్నా అయోధ్య మిన్న.
కర్ణుడు ఒక్కడే ‘దాన కర్ణుడు’గా పౌరాణికాలలో నిలిచిపోయాడు.
నాయకురాలంటే జయలలిత ఒక్కరే!
జయలలితకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వెలువడిరది. ముఖ్యమంత్రి పదవిపోయింది, అసెంబ్లీ స్ధానమూ గల్లంతయింది, రాజకీయ అనర్హత వేటు పడిరది. జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లే అనుకున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ ‘అన్నా డిఎంకె’ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదు. పైపెచ్చు మరో అయిదుగురు విపక్ష ఎమ్మెల్యేలు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి స్ధానాన్ని అధిరోహించిన పన్నీరుసెల్వం కనీసం జయలలిత ఛాంబర్ కూడా వాడుకోలేదు.
కానీ గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, మేయరుగా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి టిడిపి టిక్కెట్‌పై పోటీచేసి గెలిచిన తర్వాత టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా వుండికూడా తెలంగాణలోని ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుకోలేకపోయారు.
జైలులోవుండి, ఇంటి నాలుగ్గోడలకే పరిమితమయికూడా జయలలిత సాధించారు, చంద్రబాబు ఈ విషయంలో చతికిలపడ్డారు. ఇద్దరికీ తేడా ఇదే. ఇద్దరి మధ్య ఇంకో తేడా వుంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రసక్తి రాగానే దానివలన తన తమిళనాడుకి ఏదైనా నష్టం జరుగుతుందా అని తమిళ పక్షపాతిగా జయలలిత ఆలోచించింది. కానీ చంద్రబాబు ఎప్పుడూ ఆంధ్రుల సంక్షేమమే ధ్యేయంగా మాట్లాడరు, ఆంధ్రా ` తెలంగాణ రెండు రాష్ట్రాలు తనకు సమానమే అంటారు ఆంధ్రా ముఖ్యమంత్రి. దీనివలనే ఆస్తులు, అప్పులు, విద్యుత్తు, నీరు, కాలేజీ సీట్ల పంపిణీలో కెసిఆర్ మాట్లాడినంత ఘాటుగా చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారు. దీనివలన ఆంధ్రుల చేతికి చిప్ప వస్తోంది. మహానాడులో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత మనకూ ఓ జయలలిత లేదా కనీసంలో కనీసంగా కెసిఆర్ వంటి నాయకుడు వుంటే... అన్న ఆశ చిగురిస్తోంది.
భారతంలో దానకర్ణుడు కనిపిస్తాడు, ఈ భారత దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు జయలలిత తర్వాతే ఎవరైనా!.