Advertisementt

ఇక రేవంత్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా..??

Sun 31st May 2015 12:11 PM
revanth reddy,arrest,acb,nominated mla  ఇక రేవంత్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా..??
ఇక రేవంత్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా..??
Advertisement
Ads by CJ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా తీవ్రంగా విమర్శించిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఓ సందర్భంలో ఆయనకు టీడీపీ తెలంగాణ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్‌ కూడా వినవచ్చింది. ఇక తమను ఊపిరిసల్పకుండా విమర్శిస్తున్న రేవంత్‌కు పక్కా ప్లాన్‌తో చెక్‌పెట్టింది టీఆర్‌ఎస్‌.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని రేవంత్‌రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ క్రిస్టఫర్‌కు రూ. 5 కోట్ల ఆఫర్‌ ఇచ్చారని, అందులో భాగంగా మొదట రూ. 50 లక్షలు అందజేయడానికి వచ్చినప్పుడు రేవంత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ మేరకు ఆయన్ను అరెస్టు కూడా చేశారు. ఇన్నాళ్లు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేస్తుందంటూ విమర్శించిన టీడీపీయే ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుంది. పక్కాప్లాన్‌తో.. అన్ని ఆధారాలతో రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ లావాదేవీకి సంబంధించి ఏసీబీ స్టింగ్‌ ఆపరేషన్‌ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇక రేవంత్‌ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడినట్లే. మరోవైపు ఈ ఆరోపణలను రేవంత్‌రెడ్డి ఖండించారు. కావాలనే తనను ప్రభుత్వం ఇరిక్కించాలని చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు తెలంగాణలో రాజకీయవేడిని రెకెత్తిస్తున్నాయి. రేవంత్‌రెడ్డిలాంటి నాయకుడు చిక్కుల్లో పడితే తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ