Advertisementt

‘కొమరం భీమ్‌’ కి ఇంతకంటే ఏం కావాలి?

Wed 03rd Jun 2015 10:38 PM
komaram bheem movie,honor,kcr,telangana,allani sridhar  ‘కొమరం భీమ్‌’ కి ఇంతకంటే ఏం కావాలి?
‘కొమరం భీమ్‌’ కి ఇంతకంటే ఏం కావాలి?
Advertisement
Ads by CJ

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రదర్శిస్తున్న 

‘కొమరం భీమ్‌’  చిత్రం 

అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో ఫిల్మీడియో ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొంది వందరోజులు ప్రదర్శింప బడటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న చిత్రం ‘కొమరం భీమ్‌ ’ ఈ సినిమాను తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న సంబురాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన తెలుగు లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రదర్శిస్తోంది. తదనంతరం మరుసటి రోజు 6 వ తారీఖున స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్న భూపాల్‌ రెడ్డి ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషించడమే కాకుండా ఈ సినిమాకు పాటలు రాశారు. అలాగే ప్రముఖ దర్శకుడు గౌతం ఘోష్‌ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. సినిమా పూర్తయిన తరువాత 20 ఏండ్లకు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేష్‌ లో విడుదలయి వందరోజులు ఆడిన సినిమాగా ఇది రికార్డులు సాధించింది. అలాగే ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా అవార్డులు అందుకుంది.ఆసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్‌ అవార్డు గెలుచుకుంది . ఈ సినిమాకు గాను దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకోవడమే కాకుండా పలు ప్రతిష్టాత్మక మైన అవార్డులు ఆదివాసి జాతీయ అవార్డు లాంటివి ఎన్నో అందుకున్నారు. 

ఈ సినిమా విడుదలైన తరువాత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఇదితెలంగాణా ఆత్మ గౌరవ చిత్రం’ అని ప్రశంసించారు.

అలాగే తెలంగాణా చిత్ర పరిశ్రమలో భీష్మాశురుడు లాంటి బి. నరసింగరావు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది నేను తీసిన ‘ మా భూమి’ సినిమాకు కొనసాగింపు లాంటిది అని అన్నారు. 

బి.నరసింగరావు ఈ సినిమా గురించి ప్రస్థావిస్తూ మన్యం సీమలో అల్లూరి సీతారామ రాజు లాగా తెలంగాణాలో కొమరం భీమ్‌ విప్లవ శంఖం పూరించిన వీరుడు. రాంజీ గోండు తరువాత గోండులలో చైతన్య స్పూర్తి రగిలించి ఆది వాసులకు ఒక దశా నిర్దేశం చేసిన వాడు ఈ కొమరం భీమ్‌. అస్తిత్వ వాదం ప్రభలి, తమ హక్కుల కోసం పోరాడు తున్న తెలంగాణా ప్రజలకు కొమరం భీమ్‌ ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిచాడు. కారణాలు ఏమయినప్పటికి కొమరం భీమ్‌ చరిత్ర మరుగున పడి పోయింది. దానిని అల్లం రాజయ్య, సాహు శ్రమ కోర్చి  అదిలాబాద్‌ గిరిజన ప్రాంతాల్లో తిరిగి విషయ సేకరణ చేసి కొమరం భీమ్‌ జీవితాన్ని నవలగా మలచి పాఠకులకు ఇచ్చారు. దానికి ప్రొఫిసర్‌ జయధీర్‌ తిరుమల రావు సహకారం కూడా లభించింది. దాని తర్వాత జరిగిన ప్రయత్నాల్లో అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో కొమరం భీమ్‌ సినిమా తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ సినిమాయూనిట్‌ పరిశోధనలో భాగంగా భూపాల్‌ రెడ్డి, ప్రాణ్‌రావు, శరత్‌ బాబు, అల్లాణి శ్రీధర్‌లు అదిలాబాద్‌ అడవుల్లో ప్రవేశించారు. అక్కడి గరిజన మిత్రుల సహకారంతో కీర్తి శేషులు డాక్టర్‌.పి. సుబ్రహ్మణ్యం గారి కొమరం భీమ్‌ భార్య కొమరం సోంబాయిని కనుక్కోవడం జరిగింది. ఈ సంఘటనతో పరిశోధన వేగవంతం అయింది. అదే  మొదలు ఫిల్మీడియా సంస్థ గిరిజనుల జీవితాలను వారి పాటల్ని ఆచార వ్యవహారాలని సాంస్కృతిక పరంగా పరిశోధన సాగించింది. దీంతో చాలా మంచి ఫలితాలు వచ్చాయి .కొమరం భీమ్‌ జీవితం విశేషాలు పుష్కలంగా లభించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. కొమరం భీమ్‌ జీవితాన్ని పెనవేసి సినిమా స్క్రిప్టు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ యూనిట్‌ వారు కొమరం భీమ్‌ జీవించిన పోరాడిన స్థలాల్లో విస్త్రుతంగా పర్యటించి తమ లోకేషన్స్‌ ఎన్నుకున్నారు. ఈ నేపధ్యంలో నిర్మించబడ్డ కొమరం భీమ్‌ సినిమా ఒక సహజమైన జీవిత గాధనుచూస్తున్నామా అన్నంత అనుహూతిని కలిగించింది. ఆ రకంగా కొమరం భీమ్‌ చిత్రం ప్రజలో విజయం సాధించింది. ఈ సినిమాకు పెద్దగా ఆర్థిక వనరులు లేనప్పటికీ ఉత్సాహమే ఊపిరి గా తయారైన ఈ సినిమా తెలంగాణలో ముందు ముందు నిర్మించబడే చిత్రాలకు ఆదర్శంగా ఉండాలి. ఆ రకంగా అల్లాణి శ్రీధర్‌ రూపొందించిన ఈ చిత్రం తన సమాజిక బాధ్యతను పూర్తిగా నెరవేర్చిందని నేను భావిస్తున్నాను. 

వరవరరావు 

కొమంరం భీమ్‌ 81 నుండి వర్తమఙబాన ఆదివాసీ పోరాట యోధుడయ్యాడు. బహుశా అదే కాలం నుంచి లేదా కొంచెం అటు ఇటుగా సినిమా దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ కొమరం భీమ్‌ మీద ప్రామాణికమైన సినిమా తీయడం ప్రారంభించాడు. ఉట్నూరు ఐటిడిఏ అధికారిగా పని చేసిన సుబ్రహ్మణ్యం గారు ప్రోత్సాహంతో భూపాల్‌ను తోడు చేసుకుని 1989 దాకా చేసిన ప్రయాణాలు, పరిశోధన, కొమరం భీమ్‌ సహచరి సోనూభాయ్‌ తో ఆఖరి రోజుల్లో సంభాషణతో సహా ఆది వాసులతో కలిసి ఒక సినిమా రూపొందింది. కొన్ని లక్షణ రూపాయల వ్యయ ప్రయాసలతో నేను 1989 మార్చిలో జైలు నుంచి విడుదలై కొమరం భీమ్‌ సినిమనాను భూపాల్‌ ఇంట్లో వీడియోలో ఈ సినిమాను చూసినపుడు ఒక చారిత్రక డాక్యుమెంటరీ చూసినట్లే అనిపించింది. ఇరవై ఏండ్లు ఆ సినిమాకు డిస్ట్రిబ్యూషన్‌  గాని, థియేటర్‌ గానీ దొరక లేదు. ప్రత్యామ్నాయ సినిమాలకు ఇది కొత్త అనుభవం కాదు.అడవి అంటే దృశ్యం.అడవి అంటే చలన దృశ్యం, సజీవ దృశ్యం, అడవి అంటే శ్రావ్యం, ఎప్పుడూ ఆకుల గల గలగలతో పక్షుల కిల కిలతో, గాలి సవ్వడి ఎప్పుడో ఏదో నిశ్వబ్ధ ప్రశాంత శబ్ధం.నిరామయ భయద విహ్వల శబ్ధం కూడా .అలాంటి సంగీతాన్ని ఈ సినిమాకు సంగీతాన్ని ఫోటోగ్రఫి ఇచ్చాయి. కథ, మాటలు, దర్శకత్వం: చరిత్ర మీద ఉన్న గౌరవంతో నిర్వహించారు. 

కొమరం భీమ్‌ మాగ్రామాల్లో మా పాలన అన్నాడంటే `దాని వెనుక ఉన్న చైతన్యం ఏమిటి?అది ఆకాశం నుంచి ఊడి పడేది కాదు. అది దేశాంతరం పారి పోయి వివిధ ప్రాంతాల్లో తదాచుకోవడం వల్ల, కష్టం చేయడం వల్ల వచ్చింది. కార్మికుడిగా తేయాకు తోటల్లో పని చేయడం వల్ల వచ్చింది. నైజాం పాలనకు బయట దీనిని మించిన క్రూరుడు బ్రిటిష్‌ వాడొకడు ఉన్నాడని తెలసినందువల్ల వచ్చింది. అంతటి క్రూరుడితో కూడా తనకంటే చాఆ ముందే పోరాడిన తనవంటి ఆదివాసీ మన్నె ప్రజలున్నారనేది భరోసానిచ్చింది. అట్లా కొమరం భీం దార్శినికుడయ్యాడు. 

అల్లాణి శ్రీధర్‌ 

ఈ సినిమాను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ సంబురాల్లో భాగంగా అధికారికంగా ప్రదర్శించడం ఆనందంగా ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సినిమాను రూపొందించినందుకు ఈ నాడు మేము ఫలితాలు అనుభవిస్తున్నాము.. ఈ సినిమాను త్వరలో హిందీలో కూడా పునర్‌ నిర్మిస్తున్నాము అన్నారు చిత్ర నిర్మాత దర్శకుడు అల్లాణి శ్రీధర్‌.

                                                                                         - పర్వతనేని రాంబాబు 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ