Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ - ఛార్మి కౌర్(జ్యోతిలక్ష్మి)

Tue 09th Jun 2015 12:58 PM
charmi kaur,jyothilakshmi,poorijagannath,c.kalyan  సినీజోష్ ఇంటర్వ్యూ - ఛార్మి కౌర్(జ్యోతిలక్ష్మి)
సినీజోష్ ఇంటర్వ్యూ - ఛార్మి కౌర్(జ్యోతిలక్ష్మి)
Advertisement
Ads by CJ

ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఛార్మితో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది..?

'జ్యోతిలక్ష్మి' లో నాదొక వేశ్య పాత్ర. రొమాంటిక్ గా ఉండే ప్రాస్టిట్యూట్ పాత్రలో కనిపిస్తాను. అలాంటి అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. నిజానికి నా పాత్ర వేశ్య అయినా సినిమాలో హీరోతో తప్ప వేరే వాళ్ళతో ఉండేలా నన్ను చూపించారు. సినిమా మొదలవ్వడమే హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తరువాత ఆ వేశ్య జీవితం ఎలా మారుతుంది, తన లైఫ్ లో జరిగిన ఓ ఇష్యూ కోసం ఎలా పోరాడుతుంది అనే అంశాలతో సినిమా సాగుతుంది.

ఈ పాత్ర కోసం ఏమైనా హొమ్ వర్క్ చేసారా..?

ప్రత్యేకంగా ఎలాంటి హొమ్ వర్క్ చేయలేదు కానీ నా లుక్ కోసం పూరి గారు శరీర బరువును తగ్గించమని చెప్పారు. సుమారు 11 కేజీల బరువు తగ్గాను. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒకలా సెకండ్ హాఫ్ లో మరో లుక్ తో కనిపిస్తాను. ఈ సినిమా చూసిన వారు 'జ్యోతిలక్ష్మి' లాంటి వైఫ్ కాని కూతురు కాని మనకుంటే బావుంటుందనుకుంటారు. 

నిర్మాతగా మారడం ఎలా అనిపిస్తుంది..?

ఓ నటిగా చాలా ప్రశాంతమైన జీవితం గడిపాను. ప్రొడ్యూసర్ గా అయితే మొత్తం బ్రెయిన్ అంతా సినిమా మీదే పెట్టాలి. ఆ స్ట్రెస్, టెన్షన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా సినిమాలలో నటించాను. నిర్మాతగా వచ్చిన కిక్ ఏ సినిమాలో యాక్ట్ చేసినపుడు రాలేదు. అయినా ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. పూరి గారు కథ చెప్పగానే సినిమాను నేనే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాను. పేరు కోసం కాకుండా పని నేర్చుకోవాలనే తపనతో సినిమా నిర్మించాను. నా మీద నమ్మకంతో పూరి గారు నాపై ఇంత పెద్ద భాద్యత పెట్టారు. ముందుగా సి.కళ్యాన్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను ఎలా చేస్తాననే అనుమానం ఆయనలో కలగలేదు. సినిమాను రిలీజ్ చేయడానికి థియేటర్స్ చూడడంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.

'మిసెస్ పరాంకుశం' చాలా సంవత్సరాల క్రితం కథ. ఇప్పటి జనరేషన్ కు రీచ్ అవుతుందా..?

పూరిజగన్నాథ్ గారు ఎలాంటి సినిమాలు చేస్తారు అందరికి తెలిసిందే. ఆయన సినిమాలు స్టైలిష్ గా, ట్రెండ్ కు తగ్గట్లుగా ఉంటాయి. 45 సంవత్సరాల క్రితం రాసిన ఈ నవలను ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు తగ్గట్లుగా మార్పులు చేసాం. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది.

ఈ సినిమా నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు..?

కొంచెం డబ్బు, గౌరవం తప్ప ఈ సినిమా నుండి మరేమీ ఆశించట్లేదు. 'జ్యోతిలక్ష్మి' మొదటి కాపీ రెడీ అయిన తరువాత కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. 

బైక్ రైడ్ చేయడం ఎలా అనిపించింది..?

చిన్నప్పటి నుండి నాకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో మా అన్నయ్యకు బైక్ కొనిస్తే తను లేని టైం చూసి బైక్ డ్రైవ్ చేసేదాన్ని. 'జ్యోతిలక్ష్మి' స్క్రిప్ట్ రెడీ చేసేప్పుడు పూరిగారు కాల్ చేసి బైక్ రైడ్ సీన్ పెట్టనా అని అడిగారు. ఓకే చెప్పేసా. సినిమాలో ఆ షాట్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసి చేసాను.

మీరు చేసిన సినిమాలో అనవసరంగా ఈ సినిమాలో నటించానని అనుకున్నవి ఏమైనా ఉన్నాయా..?

నాకు 13 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీ కి వచ్చాను. మొదట్లో హిట్స్, ఫ్లాప్స్ అంటే ఏంటో తెలిసేవి కావు. వరుసగా ఏడు ఫ్లాప్స్ వచ్చాయి. డేర్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా సినిమాలు చేసి తీరాలనే థాట్ తో నటిస్తూ వచ్చాను. అలా చేసిన కొన్ని సినిమాలలో ఎందుకు నటించానా అని అనుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కాని మిస్టేక్ చేస్తేనే కథ ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. 

మీ గురుంచి ప్రేక్షకులకు తెలియని విషయాలేమైనా చెప్తారా..?

నాకు చీకటి అంటే చాలా భయం. కాని ఒక లైట్ ఆన్ చేసి ఉన్నా నాకు నిద్ర పట్టదు. చీకటి అంటే భయమే కాని అది లేకుండా ఉండలేను. అలానే డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటాను. ఎవరి పర్మిషన్స్ తీసుకోను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సినిమా కోసం డైట్ చేసి బాడీ ఫిట్ గా ఉంచుకుంటాను. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు బాగా తింటాను. ఆ సమయంలో ఎవరికీ కనిపించను. మళ్ళి డైట్ చేసి సినిమాలు చేస్తాను.

పెళ్ళెప్పుడు..?

పెళ్లి అనే కాన్సెప్ట్ బోర్.. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ