Advertisementt

సస్పెన్స్‌కు తెరపడింది..!!

Mon 15th Jun 2015 04:43 AM
mp vivek,warangalby elections,rajayya,trs,congress  సస్పెన్స్‌కు తెరపడింది..!!
సస్పెన్స్‌కు తెరపడింది..!!
Advertisement
Ads by CJ

వరంగల్‌ ఎంపీ సీటుకు అటు టీఆర్‌ఎస్‌నుంచి ఇటు కాంగ్రెస్‌ నుంచి కూడా వివేక్‌ పేరే వినబడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఈ మాజీ ఎంపీ టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చి పోటీ చేస్తారనే ఉహాగానాలు వినిపించాయి. అటు కాంగ్రెస్‌నుంచి కూడా పెద్దపల్లి వివేక్‌కు ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి అధిష్టానం ఆసక్తి చూపింది. ఈ తరుణంలో వివేక్‌ ఏ పార్టీ నుంచి పోటీచేస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

అయితే వివేక్‌ మాత్రం తాను వరంగల్‌ ఎంపీ స్థానానికి పోటీచేయబోనని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు. దీంతో అటు టీఆర్‌ఎస్‌ నుంచి ఇటు కాంగ్రెస్‌నుంచి కూడా ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొదట టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేయడానికి వివేక్‌ ఆసక్తి కనబర్చారని, ఈ మేరకు ఓ సీనియర్‌ నాయకుడి ద్వారా కేసీఆర్‌తో మంతనాలు కూడా జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇంతలో ఎమయ్యిందో ఏమోకాని తాను వరంగల్‌ స్థానానికి పోటీచేయనని వివేక్‌ ప్రకటించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు. ఇక ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు అధికంగా ఉండటంతో గులాబిదళంలో ఈ టికెట్‌ కోసం పోటీపడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో పోటీచేసిన రాజయ్యనే బరిలోకి దింపే అవకాశాలున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ