Advertisementt

సూపర్‌స్టార్‌కి ఆ తలనొప్పి ఇంకా తగ్గలేదు.!

Tue 16th Jun 2015 03:13 AM
super star rajnikanth,rajnikanth wife latha,criminal case on rajnikanth wife latha,kochadiyan movie  సూపర్‌స్టార్‌కి ఆ తలనొప్పి ఇంకా తగ్గలేదు.!
సూపర్‌స్టార్‌కి ఆ తలనొప్పి ఇంకా తగ్గలేదు.!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురి కోసం చేసిన పెద్ద తప్పు ‘కొచ్చడియన్‌’ సినిమా చెయ్యడం. తను చేసిన తప్పుకి భారీ మూల్యం చెల్లించుకున్న రజనీకి ఆ సినిమాని కొన్ని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తలనొప్పి తప్పడం లేదు. ఆమధ్య దీనికి సంబంధించి చాలా గొడవ జరిగిన విషయం, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడిరది. ఈ వివాదానికి సంబంధించి రజనీకాంత్‌ భార్య లత కోర్టులో సబ్‌మిట్‌ చేసిన డాక్యుమెంట్స్‌ చాలా తేడాగా వున్నాయని,  అందులో కొన్ని తప్పుడు డాక్యుమెంట్స్‌ కాగా, మరికొన్ని ఫోర్జరీ చేసినవిగా కోర్టు గుర్తించింది. దీంతో లతపై క్రిమినల్‌ కేసులు బుక్‌ చేశారు చెన్నై పోలీసులు. గతంలో రజనీకాంత్‌ నటించిన ‘బాబా’ చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు వారు పెట్టిన పెట్టుబడికి ఒక లక్ష కలిపి తిరిగి ఇచ్చేసిన రజనీకాంత్‌ ‘కొచ్చడియన్‌’ చిత్రానికి కూడా అలాగే చేస్తాడని ఆశించారు. కానీ, అలా జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం అంతా అతని భార్య లత చూసుకోవడం, ఈ వివాదాన్ని తప్పు దారి పట్టించడానికి చేసిన కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు క్రిమినల్‌ కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది లత. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ