ఓటుకు నోటు కేసులో పీకల్లోతూ కూరుకపోయిన టీడీపీ పార్టీ ఈ విషయం నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతోంది. ఇక ఇరు రాష్ట్రాల్లో కూడా పాలన గాడి తప్పి.. విమర్శలు ప్రతివిమర్శలకే మంత్రులు పరిమితమవుతున్నారు. అయితే అసలు ఈ కేసులో ప్రధాన పాత్రదారి స్టీఫెన్‌సన్ అయితే సూత్రధారి మాత్రం జగన్ అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణు ఆరోపిస్తున్నారు.
స్టీఫెన్‌సన్‌కు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్యే పదవి దక్కింది. అయితే ఈ పదవి దక్కడానికి జగన్ మోహన్‌రెడ్డి సాయం చేశారని యనమల ఆరోపిస్తున్నాడు. స్టీఫెన్‌కు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని కేసీఆర్‌కు జగన్ లేఖ రాసినట్లుగా తన వద్ద రుజువులు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా రేవంత్‌రెడ్డి అరెస్టుకు వారం ముందు స్టీఫెనసన్, జగన్, హరీష్‌రావులు భేటీ అయ్యారని, తమ పార్టీ నాయకులను కేసులో ఇరికించడానికి వ్యూహం రచించారనేది యనమల ఆరోపణ. అయితే ఒకవేళ జగన్ సిఫార్సుతోనే స్టీఫెన్‌సన్‌కు పదవి దక్కినా.. టీడీపీ నాయకులు చేసింది తప్పు కాకుండా పోతుందా..? అనేది వైసీపీ నాయకుల ప్రశ్న. కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందడానికే టీడీపీ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తోందని వారు విమర్శిస్తున్నారు.