Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ : ప్రిన్స్

Sat 20th Jun 2015 12:11 PM
prince,where is vidhyabalan,sampoornesh babu,madhunandan  సినీజోష్ ఇంటర్వ్యూ : ప్రిన్స్
సినీజోష్ ఇంటర్వ్యూ : ప్రిన్స్
Advertisement
Ads by CJ

ప్రిన్స్, జ్యోతిసేథ్ జంటగా క్రిష్ణ బద్రి అండ్ శ్రీధర్ రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో ఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్.వేణుగోపాల్ రెడ్డి, పి.లక్ష్మినరసింహరెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'where is విద్యాబాలన్?'. క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 26వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో ప్రిన్స్ తో  సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇదొక క్రైమ్, కామెడీ మూవీ. డిఫరెంట్ సబ్జెక్ట్. సినిమాలో లవ్, కామెడీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమాలో విద్యాబాలన్ అనేది చాలా ముఖ్యమైన పార్ట్. ఓ ఫోన్ లో విద్యాబాలన్ ఫోటో ఉంటుంది. సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. ఆ ఫోన్ వల్ల హీరో లైఫ్ ఎలా టర్న్ అయిందనేదే ఈ చిత్ర కథ. 

మీ పాత్ర ఎలా ఉండబోతోంది..?

ఇందులో నేను పిజ్జా డెలివరీ బాయ్ గా నటించాను. రెగ్యులర్ లవ్ అండ్ కామెడీతో కూడినా ఇదొక  డిఫరెంట్ సబ్జెక్ట్. రెండు గంటల పాటు ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. గత చిత్రాలలో హాస్య నటులు వినోదం చేస్తే నేను చూసేవాడిని. ఈ చిత్రంలో నేను కూడా వారితో కలసి కామెడీ చేశాను. 

సినిమాలో కామెడీ చేయడం కష్టంగా అనిపించలేదా..?

అంతా సీనియర్ నటులతో కలసి నటించడం వలన పెద్ద కష్టంగా అనిపించలేదు. వారి ఎక్స్ పీరియన్స్ నాకు హెల్ప్ అయ్యింది. నేను నటించలేదు అని చెప్పను. నా పని ఈజీ అయ్యింది. 

దర్శకుడు శ్రీనివాస్, మీ కో యాక్టర్ గురించి..?

క్రైమ్ కాన్సెప్ట్ ను తీసుకొని కమెడియన్స్ తో పాటు అన్నింటిని కథలో కలుపుకుంటూ ఈ చిత్రాన్ని తీసారు. కథలో ఎక్కడా బలవంతంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు ఉండవు. నటుడిగా నాలో ఉత్తమ నటనను బయటకు తీసుకొచ్చారు. నేను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ యాక్టింగ్ సినిమా అని చెప్పొచ్చు. లుక్, డైలాగ్ డెలివరీ తదితర విషయాల్లో చాలా కేర్ తీసుకున్నారు. నా మేనరిజం ఎలా ఉండాలో సలహాలిచ్చారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే తను పంజాబీ అమ్మాయి. గతంలో పలు యాడ్స్ లో నటించింది.         

మీ కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ సినిమా ఇప్పటివరకు రాలేదు. స్క్రిప్ట్స్ విషయంలో తప్పుగా సెలెక్ట్  చేశానని భావిస్తున్నారా..? 

లేదు. తప్పు చేయకపోతే ఏది ఒప్పో ఎలా తెలుస్తుంది. చిన్నతనంలో నడవడం నేర్చుకునే సమయంలో చాలాసార్లు కింద పడతాం, ఇది అంతే. తప్పుల నుండి చాలా నేర్చుకుంటాం. ప్రతి చిత్రం గత చిత్రం కంటే బాగా ఆడాలని కోరుకుంటాం. ఈ సినిమా మీద కాస్త ఎక్కువ నమ్మకంగా ఉన్నాను. 

ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనుకుంటున్నారు..?

కొన్ని కథలు విన్నప్పుడు బాగుంటాయి. కాని తెరపై చూసేసరికి పెద్దగా నచ్చవు. ఈ చిత్రం నేను చూశాను. మంచి కథ, తెరపై బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఎక్కడా ల్యాగ్ ఉన్నట్లు అనిపించదు. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నాను.

సినిమాలో నటించిన సంపూర్నేష్ బాబు, మధునందన్ పాత్రల గురించి..?

సంపూర్నేష్ బాబు పెద్ద మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నారు. మధు హీరోయిన్ బావగా నటించారు. నేను ఆ అమ్మాయికి లైన్ వేస్తుంటే తనకు కోపం వస్తుంది. మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో సన్నివేశాలు ఉంటాయి. 

సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తారా..?

హీరో, సపోర్టింగ్ క్యారెక్టర్ అనే విషయాలను నేను పట్టించుకోను. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

పెళ్ళికి ముందు ప్రేమకథ, డాలర్స్ కాలనీ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాను. స్రవంతి ఆర్ట్స్ లో రామ్ హీరోగా నటిస్తున్న హరికథ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాను.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ