ఏసీబీతో కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతుగా టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్‌నిచ్చిన ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు కోర్టు కూడా చుక్కలు చూపించింది. కోర్టులో ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేయడమే కాకుండా ఏకంగా ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలను ఏమాత్రం వూహించని స్టిఫెన్‌సన్ ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయాడు.
మత్తయ్య అరెస్టు స్టే విధించడాన్ని స్టిఫెన్‌సన్ కోర్టులో సవాలు చేశాడు. అంతేకాకుండా ఆ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జి కూడా నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. పీపీతోపాటు జడ్జిని కూడా మార్చేయాలని పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. దేశంలో న్యాయమూర్తులకు ఎనలేని ప్రతిష్ట ఉంది. ఏకంగా ఆయన జడ్జిపైనే ఆరోపణలు చేయడం వివాదాస్పదం కూడా అయ్యింది. అయితే స్టిఫెన్‌సన్ పిటీషన్‌పై తీర్పునిచ్చిన కోర్టు జడ్జిని మార్చే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. స్టిఫెన్‌సన్ కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని, ఆయనపైనే కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని ఆశించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని ఇరికించి సెలబ్రిటీగా మారిన స్టిఫెన్‌సన్ అదే ఊపులో అనాలోచితంగా వ్యవహరిస్తూ.. తలనొప్పులు తెచ్చుకుంటున్నాడని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.