Advertisementt

"టిఎస్సార్ టీవీ9" అవార్డ్స్ కు సర్వం సిద్ధం!

Thu 16th Jul 2015 09:44 AM
subbiramireddy,tsr tv9 awards,jamuna,jaysudha,jayapradha
"టిఎస్సార్ టీవీ9" అవార్డ్స్ కు సర్వం సిద్ధం!
Advertisement
Ads by CJ

2010లో లలిత కళా పరిషత్ సంస్థను స్థాపించిన టి.సుబ్బిరామిరెడ్డి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9తో కలసి "టిఎస్ఆర్ టీవీ9" నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని జూలై 19న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయ్యత్ హోటల్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ "అవార్డులు కళాకారులపై ప్రజలకున్న ప్రేమ, అభిమానాలను తెలియజేస్తాయి. కళాకారులకు కొండంత ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయి. ప్రభుత్వం జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తుంది. అవార్డులను చాలా మంది ఇస్తున్నారు కాని ప్రజల అభిప్రాయం తీసుకుని అవార్డులు ఇవ్వడం ఎక్కడా జరగలేదు. అందుకే, "టిఎస్సార్ టీవీ9" నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రజల అభిప్రాయం తీసుకొని ఇస్తున్నాం. 2009 లో ఈ అవార్డులను ప్రధానం చేయడం ప్రారంభించాం. 2013, 14 సంవత్సరాలకు ఈ ఏడాది అవార్డులను ఇస్తున్నాం.  ఎసెమ్మెస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించాం.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ ఇలా ఏడు భాషలకు చెందిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న టెక్నీషియన్స్ కు, ఆర్టిస్టులకు అవార్డులను అందజేయనున్నాం. జూలై 19న శిల్పకళా వేదికలో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది" అని అన్నారు. 

జమున మాట్లాడుతూ "ప్రజల అభిప్రాయాలని తీసుకొని అవార్డుల ప్రధానం చేయడం గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

ఈ సమావేశంలో జ్యూరి కమిటీ సభ్యులు జయప్రద, సురేష్ బాబు, పింకీ రెడ్డి, జీవిత, జయసుధ, ఎ.కోదండ రామిరెడ్డి, సుమన్ పాల్గొన్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ