రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మించిన చిత్రం 'కిక్2'. ఈ సినిమా ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తో సినీజోష్ ఇంటర్వ్యూ..
మంచి రెస్పాన్స్ వస్తోంది..
ఈ సినిమాను చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రేసుగుర్రం రేంజ్ లో సినిమా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. మా యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉంది.
లెంగ్త్ ఎక్కువగా ఉన్నందుకే..
సినిమా విడుదలయిన తరువాత లెంగ్త్ చాలా ఎక్కువైందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అందుకే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేశాం.
అందుకే ఈ టైటిల్ పెట్టా..
కిక్ సినిమా తండ్రి కథ ఇది కొడుకు కథ కాబట్టి 'కిక్2' అని అనుకున్నాం. సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఇదే టైటిల్ అనుకున్నాం.
సినిమా అందుకే డిలే అయ్యింది..
సినిమా షూటింగ్ రెండు నెలల్లో పూర్తి చేసేశాం. నేను చేసే ప్రతి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కేర్ తీసుకుంటాను. డి.ఐ. వర్క్, రీరికార్డింగ్ దగ్గర ఆలస్యమైంది. ఈలోగా బాహుబలి రిలీజ్ అయింది. దాంతో మేం ఆగస్ట్ 21న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం.
రెండింటికి డిఫరెన్స్ ఉంది..
'కిక్' సినిమాలో ఎంటర్‌టైనింగ్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో కామెడితో పాటు ఎమోషనల్ ఎలిమెంట్‌ను కూడా జోడించాం. 'కిక్' సినిమాకి 'కిక్2'కి ఉన్న డిఫరెన్స్ అదే. ఎమోషనల్ ఎలిమెంట్‌తో కామెడిని బ్యాలెన్స్ చేయడమనేది చాలా కష్టమైన విషయం.
ఆ వార్తలన్నీ నిజం కాదు..
సినిమా మొదలు పెట్టకముందే బడ్జెట్ గురించి నిర్మాతతో డిస్కస్ చేసాం. ఆ తరువాతే షూటింగ్ మొదలు పెట్టం. బడ్జెట్ ఎక్కువైందనే విషయంపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదు.
ఆ సీక్వెల్స్ చేయాలనుంది..
'కిక్3' చేయాలనుంది. అలాగే 'రేసుగుర్రం' సినిమాకి సీక్వెల్ చేయాలని ఉంది. అన్నీ కుదిరితే ఈ రెండు సీక్వెల్స్ తప్పకుండా చేస్తాను. అంతే కాకుండా బాండ్ తరహా సినిమాని డైరెక్ట్ చేయాలనే కల ఉంది.
కొత్త వారికి అవకాసం ఇస్తా..
చిన్న సినిమాలు ఖచ్చితంగా చేస్తా. అలానే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. నా ప్రొడక్షన్ హౌస్‌లో నేనే డైరెక్షన్ చేస్తాను. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఈ సంవత్సరంలో రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాను. కోన వెంకట్ గారు మంచి స్టొరీ చెప్పారు. రామ్‌చరణ్‌ని కలిసి కథ చెప్పాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.