Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-విజయన్(డైనమైట్)

Wed 02nd Sep 2015 07:45 AM
vijayan master,dinamite,vishnu,mohan babu  సినీజోష్ ఇంటర్వ్యూ-విజయన్(డైనమైట్)
సినీజోష్ ఇంటర్వ్యూ-విజయన్(డైనమైట్)
Advertisement
Ads by CJ

తెలుగులో సుమారుగా 493 సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పని చేసి కొన్ని చిత్రాల్లో నటించి రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించిన ఫైట్ మాస్టర్ విజయన్. ప్రస్తుతం ఆయన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నడైనమైట్ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా పని చేసారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విజయన్ మాస్టర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మోహన్ బాబు గారు ప్రత్యేకంగా అడిగారు..

నేను తెలుగులో 493 సినిమాలు చేసాను. అందులో 409 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో నా ప్రయాణం మొదలు పెట్టి 35 ఏళ్ళు దాటింది. ఇంకా నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మోహన్ బాబు గారు నా దగ్గరకి వచ్చి విష్ణు బాబు కు నెంబర్ వన్ యాక్షన్ సినిమా కావాలని చెప్పారు. ఆయన అడిగిన వెంటనే నేను మొదట విష్ణును మీట్ అవ్వాలి. అప్పుడే చేయగలనా లేదా అనే విష్యం చెప్పగలనని చెప్పాను. సాధారణంగా నేను విష్ణును ఎప్పుడు కలిసినా ఇన్స్టిట్యూషన్స్ గురించి తప్ప వేరే టాపిక్ మాట్లాడేవాడు కాదు. అలాంటి వ్యక్తి యాక్షన్ సినిమాకు ఫిట్ అవుతాడా లేదా అని డౌట్ ఉండేది. కాని విష్ణు ఈ సినిమా కోసం చాలా రిహార్సల్స్ చేసాడు. 

యాక్షన్ సినిమా అయినా రెగ్యులర్ గా ఉండదు..

సాధారణంగా యాక్షన్ ఫిల్మ్స్ అంటే కొట్టుకుంటూ ఉంటారు. కాని ఈ సినిమాలో అలా కాకుండా డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. ఇదొక మూమెంటరల్ స్క్రిప్ట్. మూవీ అంతా చాలా లాజికల్ గా రన్ అవుతుంటుంది. 

నెలకు ముందే అన్ని రాసిచ్చా..

విజయన్ మాస్టర్ అంటే చాలా టైం తీసుకుంటారు. సినిమా అనుకున్న సమయంలో పూర్తి కాదేమో అని అందరూ అనుకుంటారు. విష్ణు కూడా అలానే భయపడ్డాడు. కాని ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన నెలకు ముందే యాక్షన్స్ అన్ని డిజైన్ చేసేసా. ఎలాంటి ప్లేస్ లో షూట్ చేస్తే బావుంటుంది, ఎలాంటి సెట్స్ వేయాలి, ఎలాంటి బిల్డింగ్స్ కావాలి అనేవన్నీ క్లియర్ గా లిస్టవుట్ చేసి ఇచ్చేశాను. 

తెలుగు ఆడియన్స్ టేస్ట్ నాకు తెలుసు..

తమిళంలో నేను పది సినిమాలే చేసాను అంటే చాలా మంది షాక్ అయ్యారు. అదే తెలుగులో ఎన్నో చిత్రాలకు పని చేసాను. తెలుగు ఆడియన్స్ టేస్ట్ నాకు తెలుసు. క్లాస్ ఆడియన్స్ కు, మాస్ ఆడియన్స్ కు, చిల్డ్రన్ కు ఎలాంటి యాక్షన్ ఉంటే నచ్చుతుందో ఎనలైజ్ చేయగలిగితేనే హిట్ అవ్వగలము. 

మొత్తం 16 ఫ్రాక్చర్స్ పడ్డాయి..

నాకు పదిహేడేళ్ళ వయసులోనే స్టంట్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసాను. ఎన్నో రిస్కీ షాట్స్ చేసాను. డబ్బు సంపాదించాలి మా నాన్న గారిని బాగా చూసుకోవాలి అనే ఆలోచన తప్ప మరొకటి ఉండేది కాదు. మొత్తం శరీరంలో 16 ఫ్రాక్చర్స్ పడ్డాయి. వాటిని కూడా నేను చాలా ఎంజాయ్ చేసాను. భయపడితే ఇండస్ట్రీలో ఇప్పటికి ఉండేవాడ్ని కాదు. సమస్యలని కూడా ఎంతో ఎంజాయ్ చేసి బ్రతికాను కాబట్టే హీరోలందరికీ నేనంటే చాలా ఇష్టం. 

అందుకే గ్యాప్ తీసుకున్నాను..

హిందీలో కొన్ని చిత్రాలకు కమిట్ అయ్యాను. అదే కాకుండా నా కొడుకు హీరో అవ్వాలనే బాధ్యత తీసుకున్నాను. అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు తను మూడో చిత్రంలో నటిస్తున్నాడు. నా బాధ్యత కొంచెం నెరవేరింది అందుకే సినిమాలు చేయడం మొదలుపెట్టాను. 

అదొక ఆనవాయితీ అయింది..

మొదటగా సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యే హీరోలందరికీ స్టంట్ మాస్టర్ గా చేయడానికి నన్నే ప్రిఫర్ చేసేవారు. సుమారు స్టార్ హీరోలందరి పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసిన చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా నేనే వ్యవహరించేవాడ్ని. ఇండస్ట్రీలో అదొక ఆనవాయితీలా జరిగేది. 

వాళ్ళిద్దరిని చాలా కష్టపెట్టాను..

సాధారణంగా నా సినిమాలో హీరోలను చాలా హింసించేవాడ్ని. అలా చేస్తేనే మంచి అవుట్ పుట్ వస్తుంది. వారికు మంచి పేరు రావాలనే అలా చేసేవాడ్ని. ఈ సినిమాలో కూడా విష్ణును, ప్రణీతను చాలా కష్టపెట్టాను. వారిద్దరికీ దెబ్బలు కూడా బాగా తగిలాయి. దేవకట్ట స్టయిలిష్ డైరెక్టర్. తన సినిమాలు కూడా అలానే ఉంటాయి. విష్ణు ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేసాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. 

హిందీ లో చేస్తా..

ఇప్పటికి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. నెక్స్ట్ ఇయర్ హిందీలో ఓ చిత్రానికి దర్శకత్వం చేయాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ