దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హోరా హోరి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దక్ష తో సినీజోష్ ఇంటర్వ్యూ...
నటనపై ఆసక్తి ఉండేది..
నేను పుట్టింది మహారాష్ట్రలో అయినా పెరిగిందంతా బొంబాయి లోనే. కుటుంబమంతా బెంగుళూరులో సెటిల్ అయింది. నేను ప్రస్తుతం బి.బి.ఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మొదటి నుంచి నటనపై చాలా ఆసక్తి ఉండేది. అందుకే మోడలింగ్ చేసేదాన్ని. తేజ గారు మొదట ఈ సినిమా కోసం వేరే అమ్మాయిని కన్ఫర్మ్ చేసారు. షూటింగ్ కూడా మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే తేజ గారు మాత్రం ఇంకా బెటర్ గా కావాలనే ఉద్దేశ్యంతో మోడలింగ్ చేసినప్పుడు నన్ను చూసి పిలిపించారు. ఒక ఆడిషన్ ఇవ్వగానే ఆయనకు నచ్చి ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.
ఆయన చాలా ఫేమస్..
తేజ గారు బొంబాయిలో చాలా ఫేమస్. బాజీ, గులాం వంటి హిట్ సినిమాలు చేసారు. అక్కడ ప్రతి ఒక్కరికి తేజ గారు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం, నిజం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆఫ్ స్క్రీన్ ఆయన జోవియల్ గా చీర్ ఫుల్ గా ఉంటారు. ఆన్ స్క్రీన్ మాత్రం మన 100% పెర్ఫార్మన్స్ ఇవ్వాలి లేదంటే ఆయన చాలా సీరియస్ అయిపోతారు. ఆయన ఎంత హార్ష్ గా బిహేవ్ చేసిన అది కేవలం సన్నివేశం కోసమే. ఆయన సినిమాలలో ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తేజ గారి సినిమా అని టెంప్ట్ అయ్యాను..
మొదట నేను తేజ గారి సినిమా అని ఓకే చేసాను. ఆయన చిత్రాల్లో నటనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తరువాత స్క్రిప్ట్ విన్నాక నాకు బాగా నచ్చింది. సినిమాలో నాకు సోలో సాంగ్ కూడా ఉంది.
మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది..
ఈ సినిమాలో నా పాత్ర పేరు మైథిలి. ఎప్పుడూ సంతోషంగా ఉండే అమ్మాయికి కొన్ని పరిస్థితుల వల్ల మెంటల్ సిక్ నెస్ వస్తుంది. దాంతో డాక్టర్స్ తనని ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్ కు తీసుకువెళ్ళమని చెబుతారు. అలా వెళ్ళిన అమ్మాయికి హీరోతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే సినిమా. 80% సినిమా వర్షంలోనే షూట్ చేసాం. మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది.
ఎలాంటి వర్క్ షాప్స్ లేవు..
సినిమా షూటింగ్ కు ముందు రిహార్సల్స్ కాని యాక్టింగ్ వర్క్ షాప్స్ కాని ఏమి లేవు. తేజ గారు ఫ్రెష్ యాక్టింగ్ కావాలని ఫీల్ అయ్యారు. షూటింగ్ లో మనం చేయాల్సింది ఆయన క్లీన్ గా ఎక్స్ప్లైన్ చేస్తారు. అప్పటికప్పుడు నటించడమే. ఆయన యూనివర్సిటీ లాంటి తేజ గారు ఉండగా వర్క్ షాప్స్ ఎందుకు చెప్పండి.
30 సినిమాలు చూసాను..
ఈ సినిమా ఓకే చేసినప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. నా తెలుగు డిక్షన్ కోసం రీసెంట్ గా రిలీజ్ అయిన 30 సినిమాలు చూసాను. ఇక్కడ యాక్టర్స్ కూడా కొంతమంది మాత్రమే తెలుసు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతానికి ఏ సినిమా సైన్ చేయలేదు. హోరా హోరి రిలీజ్ తరువాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.