Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: కాజల్‌ అగర్వాల్‌

Mon 07th Sep 2015 12:17 AM
heroine kajal agarwal,jayasurya heroine kajal,kajal agarwal interview about jayasurya  సినీజోష్‌ ఇంటర్వ్యూ: కాజల్‌ అగర్వాల్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: కాజల్‌ అగర్వాల్‌
Advertisement
Ads by CJ

లక్ష్మీకళ్యాణం నుండి టెంపర్‌ వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న అందాల నటి కాజల్‌ అగర్వాల్‌ తాజాగా మాస్‌ హీరో విశాల్‌తో నటించిన జయసూర్య వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్‌ 4న విడుదలై సూపర్‌హిట్‌ అయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కాజల్‌ పాత్రికేయులతో ముచ్చటించింది. 

జయసూర్య రిలీజ్‌ అయ్యాక రెస్పాన్స్‌ ఎలా వుంది? 

- చాలా బాగుంది. గోవిందుడు అందరి వాడేలే, టెంపర్‌ చిత్రాల తర్వాత తెలుగులో జయసూర్య మంచి హిట్‌ సినిమా అయింది. సినిమా రిలీజ్‌ అయినప్పటి నుంచీ చాలా బాగుంది అన్న టాక్‌ అన్ని చోట్ల నుంచీ వస్తోంది. ముఖ్యంగా నా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుందని అందరూ ఎప్రిషియేట్‌ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంది. 

జయసూర్య కథ విన్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు? 

- ఇందులో హీరోయిన్‌ క్యారెక్టర్‌ స్టోరీతో లింక్‌ అయి వుంటుంది. స్కూటర్‌ డ్రైవ్‌ చెయ్యడం రాని అమ్మాయి చాలా ఇన్నోసెంట్‌గా వుంటుంది. తనని టీజ్‌ చస్తున్న ఓ రౌడీని కొట్టమని హీరోని రిక్వెస్ట్‌ చేస్తే హీరో ఏకంగా క్షణంలో రౌడీ గ్యాంగ్‌ని మర్డర్‌ చేసేసి హీరోయిన్‌కి షాక్‌ ఇస్తాడు. ఈ స్టోరీ వింటున్నప్పుడే నేను థ్రిల్‌ ఫీల్‌ అయ్యాను. డైరెక్టర్‌ సుశీంద్రన్‌ చెప్పిన దాని కంటే ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. నేను చేస్తున్న సినిమాల్లో జయసూర్య వెరైటీగా వుంటుందని కథ విన్నప్పుడే ఫీల్‌ అయ్యాను. ఇప్పుడు ఆడియన్స్‌ కూడా అదే ఫీల్‌ అవడం వలన ఇంత మంచి హిట్‌ అయింది. సుశీంద్రన్‌ సినిమా చాలా గ్రిప్పింగ్‌గా తీసారు. విశాల్‌, సముద్రఖని పెర్‌ఫార్మెన్స్‌ సూపర్‌గా చేశారు. క్లైమాక్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. క్లైమాక్స్‌లో ఉత్కంఠ సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్ళింది. 

జయసూర్యలో మీకు నచ్చిన పాట? 

- ఇమాన్‌ సూపర్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అన్ని పాటలూ బాగుంటాయి. నాకు పర్సనల్‌గా తెలుగు తనమా పాట బాగా ఇష్టం. రీరికార్డింగ్‌ టెరిఫిక్‌గా చేసారు. రీరికార్డింగ్‌ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. 

విశాల్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎలా వుంది? 

- విశాల్‌ చాలా ఫ్రెండ్లీ నేచర్‌ వున్న వ్యక్తి. అందరితో చాలా బాగా మూవ్‌ అవుతారు. బట్‌ ప్రొఫెషనల్‌గా చాలా సిన్సియర్‌గా, డెడికేటెడ్‌గా వుంటారు. విశాల్‌తో కలిసి నటించడం నైస్‌ ఎక్స్‌పీరియన్స్‌. మళ్ళీ మళ్ళీ విశాల్‌తో కలిసి నటించాలని వుంది. తప్పకుండా చేస్తాం. 

సుశీంద్రన్‌ వర్కింగ్‌ స్టైల్‌ ఎలా వుంది? 

- సుశీంద్రన్‌ సార్‌ స్టోరీ అనుకున్నప్పుడే అన్నీ చాలా పక్కాగా ప్లాన్‌ చేసుకుంటారు. స్క్రీన్‌ప్లే చాలా పకడ్బందీగా వుంటుంది. ఇంతకుముందు సుశీంద్రన్‌గారి డైరెక్షన్‌లో కార్తీతో కలిసి నాపేరు శివలో నటించాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. నా పేరు శివ చేస్తున్నప్పుడే సుశీంద్రన్‌ గారితో మళ్ళీ వర్క్‌ చేయాలనిపించింది. జయసూర్యలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. 

మీ కొత్త చిత్రాలు? 

- పవన్‌కళ్యాణ్‌గారితో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చేస్తున్నాను. మహేష్‌బాబుగారితో బ్రహ్మూెత్సవం చేయబోతున్నాను. మరికొన్ని సినిమాలు కథా చర్చల్లో వున్నాయి. తెలుగు, తమిళ్‌, హిందీ మూడు భాషల్లోనూ మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. హీరోయిన్‌గా నాకు ఇంత మంచి గుర్తింపు రావడానికి కారణమైన నా దర్శకనిర్మాతలకు, నటిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు జయసూర్య హిట్‌ అయిన సందర్భంగా నా స్పెషల్‌ థాంక్స్‌ చెప్తున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ